ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఉండటం చాలా కష్టమే. దగ్గరలో చెట్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓ గార్డెన్ ఉన్నా, లేదా నీడ ఎక్కువగా ఉండే చెట్లు ఉంటే ఆ చెట్ల కింద కుర్చీ వేసుకొని కూర్చోవాలి అనిపిస్తుంటుంది.
ఊరిలో ఉండేవారు ఇప్పటికీ ఇలాగే చేస్తుంటారు. కానీ పట్నం ప్రజలకే ఈ అదృష్టం ఉండదు. అయితే ఎండలు, వేడి భరించలేక ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. మరి మీరు కూడా ఏసీ తీసుకున్నారా? ఈ ఏసీ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అంతే సంగతలు..
ఏసీ వేసుకున్నప్పుడు ఇంట్లో ఫ్యాన్ ను కూడా వేస్తున్నారా? ఇంతకీ ఏసీ వేసిన తర్వాత ఫ్యాన్ ను ఆన్ చేయాలా? చేయవద్దా? చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయకూడదు అంటే నిపుణులు మాత్రం ఫ్యాన్ ను ఆన్ చేయాలి అంటున్నారు. కానీ ఈ ఫ్యాన్ ను స్పీడ్ లో మాత్రం పెట్టవద్దట. కేవలం రెండు లేదా మూడు నెంబర్ లో పెట్టి మాత్రమే ఫ్యాన్ ను ఉపయోగించాలట.
ఏసీ వేసుకొని ఫ్యాన్ ను కూడా ఆన్ చేసుకునే వారు కంగారు పడాల్సిన అవసరం లేదన్నమాట. దీని వల్ల నష్టం లేకపోగా లాభమే ఉంది అంటున్నారు నిపుణులు. ఏసీ వేసుకొని ఫ్యాన్ వేయడం వల్ల ఏసీ గాలి రూమ్ మొత్తం త్వరగా వ్యాపిస్తుంది. మీ గది కూడా త్వరగా చల్లగా మారుతుంది. ఏసీ తక్కువ స్పీడ్ లో ఉన్నా కూడా చల్లగా ఉన్న ఫీల్ వస్తుంటుంది. కానీ ఏసీ గాలి బయటకు రాకుండా తలుపులు, కిటికీలు మాత్రం మొత్తం క్లోజ్ చేసుకొని పెట్టుకోండి.
ఇలా అన్ని డోర్లను క్లోజ్ చేయడం వల్ల రూమ్ మరింత త్వరగా చల్లబడుతుంది. దీంతో కరెంబ్ బిల్ కూడా ఆదా చేసిన వారు అవుతారు. కానీ ప్యాన్, కూలర్లను రెండింటిని ఒకేసారి ఆన్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. అవి వ్యతిరేక దిశల్లో పనిచేస్తాయి. కాబట్టి ఈ రెండు పరికరాలను ఒకేసారి ఉపయోగించవద్దు.