రూ.80,000కే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, రేంజ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

www.mannamweb.com


పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో, చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ, ఆటోమొబైల్ దిగ్గజం హోండా, తన సూపర్ హిట్ యాక్టివా బ్రాండ్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది.
రిపోర్ట్స్ ప్రకారం, 2025, జనవరి 1 నుంచి హోండా యాక్టివా-ఇ (Activa-e) స్కూటర్ల బుకింగ్స్‌ ఓపెన్ అవుతాయి. 2025, ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.

హోండా నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. దీని ధరను జనవరి 17న ప్రారంభమయ్యే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో వెల్లడిస్తారు. స్టైలిష్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ యాక్టివా-ఇ, ఓలా S1 X, బజాజ్ చేతక్ 2903, విడా V2, TVS ఐక్యూబ్ లాంటి టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

* యాక్టివా-ఇ పనితీరు, రేంజ్
యాక్టివా-ఇ (Honda Activa-e) స్కూటర్ రెండు వేరియెంట్స్‌లో రానుంది. అవి ‘యాక్టివా-ఇ’, ‘యాక్టివా-ఇ: హోండా రోడ్‌సింక్ డ్యుయో’ (టాప్ వేరియంట్). ఇవి రెండూ డ్యుయల్ స్వాపబుల్ బ్యాటరీలతో వస్తాయి. అంటే ఛార్జ్ చేయడానికి బ్యాటరీలను రిమూవ్ చేయవచ్చు. ఒక్కో బ్యాటరీ 1.5 kWh కెపాసిటీతో వస్తుంది. ఫుల్ ఛార్జ్‌తో ఏకంగా 102 కిలోమీటర్ల వరకు రైడ్ చేయొచ్చు.

బైక్ వెనుక చక్రం దగ్గర పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 8 హార్స్‌పవర్, 22 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల సిటీ సిటీ రోడ్లపై స్మూత్ రైడ్స్‌ ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు, కావాల్సినప్పుడు ఫాస్ట్ పిక్-అప్ కూడా అందుకోవచ్చు. కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 60 km/h స్పీడ్‌ అందుకోవడం దీని స్పెషల్. హోండా యాక్టివా-ఇ టాప్ స్పీడ్ గంటకు 80 km/h.

* ఛార్జింగ్
యాక్టివా-ఇ స్కూటర్‌ను ఛార్జ్ చేయడం చాలా సింపుల్. హోండా కంపెనీ ఇచ్చే హోమ్ ఛార్జర్‌తో వెహికల్‌ను ఫుల్‌గా ఛార్జ్ చేయడానికి 6 గంటల 50 నిమిషాలు పడుతుంది. ఒకవేళ తొందరగా వెళ్లాల్సి ఉంటే, కేవలం 4 గంటల 30 నిమిషాల్లో 80% ఛార్జ్ చేసుకోవచ్చు.

* స్టైలిష్ డిజైన్, ఫీచర్లు
యాక్టివా-ఇ డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. 12-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, కంఫర్ట్‌గా ఉండటానికి ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, స్టైలిష్ డ్యుయల్-టోన్ సీటు దీని ప్రత్యేకతలు. మంచి వెలుతురు కోసం, బ్యూటిఫుల్ లుక్ కోసం ఆల్-ఎల్ఈడీ లైటింగ్ ఇచ్చారు. హైలైట్ ఏంటంటే, 7-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, ఇది స్కూటర్‌కి మోడ్రన్ లుక్ తీసుకొస్తుంది. అయితే యాక్టివా ఇ బేస్ మోడల్ 5-అంగుళాల TFT స్క్రీన్‌తో వస్తుంది.
* స్మార్ట్ ఫీచర్లు, బ్యాటరీ రెంటల్ సౌకర్యం
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) కంపెనీ రైడర్ల సౌలభ్యం, సేఫ్టీ కోసం యాక్టివా-ఇలో అదిరిపోయే ఫీచర్లు అందించింది. స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ సేఫ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్ వంటి ఫీచర్లతో స్కూటర్ రైడింగ్ మరింత ఈజీ అవుతుంది. బ్యాటరీ గురించి ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. హోండా ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ (BaaS) ప్లాన్‌తో బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు. ఎంత దూరం వెళ్తే అంత డబ్బులు కట్టొచ్చు.

* త్వరలో సేవల విస్తరణ
బెంగళూరు దగ్గరలోని నరసపుర ప్లాంట్‌లో యాక్టివా-e తయారీ జరుగుతోంది. తొందర్లోనే దీన్ని పెద్ద సిటీల్లో రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరిలో మార్కెట్‌లోకి వస్తుందని అంచనా. హోండా యాక్టివా-ఇ ప్రారంభ ధర దాదాపు రూ.80,000 (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. టాప్ వేరియంట్ ధర దాదాపు రూ.5,000-7,000 ఎక్కువ ఉంటుంది.