వాట్సాప్ యూజర్లకు శుభవార్త! ఇకపై మీరు పంపే సందేశాలు మరింత ఆకట్టుకునేలా మార్చవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్, తాజాగా ఒక కొత్త AI ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘రైటింగ్ హెల్ప్’ అని పిలిచే ఈ కొత్త ఫీచర్, మీరు టైప్ చేసే సందేశాలను మెరుగుపరచడానికి, తిరిగి రాయడానికి లేదా వాటి టోన్‌ను మార్చడానికి ఉపయోగపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షిస్తున్న వాట్సాప్ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. తమ వినియోగదారుల కోసం ‘రైటింగ్ హెల్ప్’ అనే కృత్రిమ మేధ (AI) ఆధారిత ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్‌లో మెసేజ్ పంపే ముందు, దానిని ఎడిట్ చేయడానికి, తిరిగి రాయడానికి లేదా టోన్ మార్చడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది
సందేశాలను మరింత వృత్తిపరంగా, హాస్యంగా లేదా ప్రోత్సాహకరంగా మార్చడానికి ఈ రైటింగ్ హెల్ప్ ఫీచర్ ఏఐతో కూడిన సలహాలు ఇస్తుంది. ఉదాహరణకు, ‘దయచేసి మురికి సాక్స్‌లను సోఫాపై వదిలివేయవద్దు’ అనే సందేశాన్ని ‘బ్రేకింగ్ న్యూస్: సాక్స్‌లు సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్నాయి’ లాంటి సరదా రీతిలో మార్చి ఇస్తుంది. తద్వారా చాటింగ్‌ను మరింత ఆసక్తికరంగా మలచవచ్చు.
వినియోగదారుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వాట్సాప్ ఈ ఫీచర్‌ను మెటా ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో రూపొందించింది. దీనివల్ల అసలు సందేశాన్ని, లేదా ఏఐ సూచించిన మార్పులను మెటా, వాట్సాప్ చూసే అవకాశం ఉండదు. ఈ టెక్నాలజీ ఎన్‌క్రిప్టెడ్, అనామక మార్గంలో సందేశాలను పంపుతుంది. అందువల్ల వినియోగదారుల సమాచారం సురక్షితంగా ఉంటుంది.
ఈ ఫీచర్ వాడకం పూర్తిగా వినియోగదారుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. డిఫాల్ట్‌గా ఇది డిసేబుల్ చేయబడి ఉంటుంది. వినియోగదారులు మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు కనిపించే పెన్సిల్ గుర్తును నొక్కి ఈ ఫీచర్‌ను ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీరు ఎంపిక చేసుకున్న నిర్దిష్ట సందేశానికి మాత్రమే పని చేస్తుంది, పూర్తి చాట్‌కు కాదు. అలాగే, మీ అనుమతి లేకుండా ఏఐ రూపొందించిన సందేశాలను ఎప్పటికీ పంపదు.
































