AHD Recruitment 2024 : ఏపీ పశుసంవర్ధక శాఖలో 26 వీఏఎస్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌..

www.mannamweb.com


AP AHD Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖలో మ‌రో ప్ర‌భుత్వ నోటిఫికేష‌న్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే ప‌శుసంవ‌ర్థ‌క శాఖ‌లో 1896 యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇదే శాఖ‌లో మ‌రికొన్ని పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. బ్యాక్‌లాగ్‌ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా 26 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేష‌న్‌ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. అర్హ‌త, అస‌క్తి క‌లిగిన ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఈ పోస్టుల‌కు ఆఫ్‌లైన్ విధానంలో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులకు ఫిబ్రవరి 7వ తేదీ వరకు అవ‌కాశం ఉంటుంది.
ఇటీవ‌లే మొత్తం 1,896 పశు సంవర్ధక సహాయకులు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేశారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 31వ తేదీన ఈ పోస్టుల‌కు సంబంధించిన రాత‌ప‌రీక్ష‌ను కూడా నిర్వ‌హించడం జ‌రిగింది. ఈ రాత పరీక్ష తుది కీ ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ విడుదల చేయ‌డం జ‌రిగింది. ఇక‌, వీటి తుది ఫ‌లితాల‌ను జ‌న‌వ‌రి 17 విడుద‌ల చేశారు. ఇప్ప‌డు, తాజాగా బ్యాక్‌లాగ్‌ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా 26 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టుల‌కు ఎంపిక‌యిన వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ స‌చివాల‌యాల్లో రెండు సంవ‌త్స‌రాల పాటు ప్రొబేష‌న‌రీ పీరియ‌డ్ ఉంటుంది.

ఇత‌ర అర్హ‌త వివ‌రాలు : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ : మొత్తం 26 పోస్టులు

విద్యా అర్హతలు: బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వ‌య‌సు : 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
శాల‌రీ : నెలకు రూ.54,060-1,40,540 గా ఉంటుంది.
అభ్య‌ర్థులు దరఖాస్తు విధానం: ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం, లబ్బిపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2024.
పూర్తి వివరాల కోసం అభ్య‌ర్థులు ఈ https://ahd.aptonline.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించ‌గ‌ల‌రు.