క్రెడిట్ స్కోర్‌కు AI మైలేజ్.. ఓ లుక్ వేయండి

మీ క్రెడిట్ స్కోర్ ఎంత. అవునండీ మీ క్రెడిట్ స్కోర్ ఎంత.. అత్యవసర సమయాల్లో మీరు బ్యాంకులకు వెళ్లి లోన్ తీసుకునే ముందు మీకు వినిపించే మొదటి మాట ఇది. మీ కెడ్రిట్ స్కోర్ ఆధారంగానే మీకు బ్యాంక్ లోన్ మంజూరు చేయాలా వద్దా అనేది చూస్తుంది. సరే ఒకవేళ.. మీ CIBIL లేదా క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా.. మీరు దాని గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్టోరీ మీకు కచ్చితంగా యూజ్ అవుతుంది. ఏఐ ద్వారా క్రెడిట్ స్కోర్‌ను ఎలా పెంచుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..


క్రెడిట్ స్కోరు అంటే..
మీరు అత్యవసర సమయాల్లో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల బిల్లులను ఎంత బాగా చెల్లించారో చూపించే ఒక సంఖ్య. ఈ స్కోరు సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీ స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీకు రుణాలు, క్రెడిట్ కార్డులను సులభంగా ఇస్తాయి. కానీ మీ స్కోరు 600 – 650 మధ్యలో ఉంటే మీరు రుణం పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. రుణాల బిల్లులు సకాలంలో చెల్లించడం, క్రెడిట్ వినియోగాన్ని 30% కంటే తక్కువగా ఉంచడం, తరచుగా రుణాలకు దరఖాస్తు చేసుకోకపోవడం చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని చాలా మందికి తెలుసు. ఇవన్నీ చేసినప్పటికీ కొన్నిసార్లు స్కోరు మెరుగుపడటం లేదు. అటువంటి పరిస్థితిలో AI మీకు హెల్ప్ చేస్తుంది. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏఐ హెల్ప్ తీసుకొని మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి.

AI ఎలా హెల్ప్ చేస్తుంది..
మీ ఆదాయం, ఖర్చులు, గత డిఫాల్ట్‌లు, క్రెడిట్ నివేదికలో నమోదు చేసిన తప్పులు మొదలైన మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి AI మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అడుతుంది. వాటికి మీరు చెప్పిన సమాధానాలను AI విశ్లేషించి, తక్కువ క్రెడిట్ స్కోరుకు కారణం ఏమిటో గుర్తిస్తుంది. తర్వాత అది మీకు ఒక కస్టమ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇక్కడ కస్టమ్ ప్లాన్‌ అంటే మీ కోసమే రూపొందించిన ఒక వ్యూహం అని అర్థం. AI చెప్పినట్లు దీనిని మీరు అనుసరిస్తే మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చని పలువురు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.