బీ అలెర్ట్.. భూమి లోపల 86,000 భూకంపాలను గుర్తించిన ఏఐ.. ఆ దేశంలో అధికం.

ష్యా తీరంలో తాజాగా భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌ పై 8.8 గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా రష్యాలోని కమ్చట్కా ద్వీపంతో పాటు జపాన్‌ కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.


అటు అమెరికాలోని హవాయి రాష్ట్రానికి కూడా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అయితే ప్రస్తుతం అన్ని రంగాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోతోంది. ఎన్నో క్లిష్టమైన సమస్యలు, అంతు చిక్కని ప్రశ్నలకు ఏఐ సమాధానం ఇస్తోంది. ఎన్నో విపత్తులను ముందుగానే ఏఐ పసిగడుతోంది.

ప్రస్తుతం ఏఐ అన్ని రంగాల్లోకి చొచ్చుకొచ్చింది. అనేక సమస్యలను ఛేదిస్తోంది. తాజాగా ఏఐ ఓ విషయాన్ని వెల్లడించింది. భవిష్యత్తులో అమెరికా ప్రమాదంలో పడే అవకాశం ఉందని తేల్చింది. అమెరికాలోని యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ భూభాగం అడుగున భారీ స్థాయిలో భూ ప్రకంపనలు ఉన్నట్లు.. లోపలి భూభాగం భూకంపానికి అనువైన ప్రదేశంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ పార్కు మాత్రమే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా భూకంపాలు నమోదయ్యే ప్రమాదం ఉన్నట్లు తేలిందని ఏఐ స్పష్టం చేసింది.

ఈ మేరకు గత 15 సంవత్సరాలకు సంబంధించి సిస్మిక్ సమాచారాన్ని ఏఐ ప్రాప్టింగ్ చేయగా.. విస్తుపోయో విషయాలను వెల్లడించింది. దాదాపు 86 వేలకుపైగా భూకంపాలను ఏఐ గుర్తించింది. ఇవన్నీ చిన్న చిన్న భూకంపాల సిరీస్ గా పేర్కొంది. అయితే ఎంతైనా అప్రమత్తత అవసరం అని అభిప్రాయపడింది. యెల్లో స్టోన్ ప్రాంతంలో ప్రతి ఆరు లక్షల 20 వేల సంవత్సరాలకు ఒకసారి భూకంపం సంభవిస్తుందని తెలిపింది. ఆరు లక్షల 20 వేల సంవత్సరాల క్రితం ఈ భూభూగంలో భారీ భూకంపం సంభవించిందని.. మరోసారి అన్ని సంవత్సరాలకు భూకంపం వస్తుందని ఏఐ అంచనా వేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.