ఎయిర్‌టెల్ ఏక్ ధమ్ రీఛార్జ్ ప్లాన్.. తక్కువ ధరకే బోలెడు ప్రయోజనాలు

 దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన ఎయిర్‌టెల్ (Airtel) దాని 38 కోట్ల మంది వినియోగదారుల కోసం రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ తన యూజర్స్ కోసం తక్కువ ధరకే రెండు ప్లానలను అందుబాటులోకి తెచ్చింది.


ఎయిర్‌టెల్ రూ. 489 ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్లాన్ 77 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్ లో కస్టమర్లకు అపరిమిత కాల్స్, 6GB డేటా మరియు మొత్తం 600 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో స్పామ్ కాల్ మరియు SMS హెచ్చరికలు, అపోలో 24/7 సర్కిల్ మరియు ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ. 799 ప్లాన్ : ఈ ప్లాన్ 77 రోజుల చెల్లుబాటు వ్యవధిని కలిగి ఉంది. ఈ ప్లాన్ లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో స్పామ్ కాల్ మరియు SMS హెచ్చరికలు, అపోలో 24/7 సర్కిల్ మరియు ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.