Ajwain Health Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా? వాముతో ఇలా ట్రై చేయండి!

www.mannamweb.com


Ajwain Health Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా? వాముతో ఇలా ట్రై చేయండి!

మారుతున్న ఆధునిక జీవన శైలి, ఆహార అలవాట్లు చాలామందిలో ఊబకాయానికి దారితీస్తున్నాయి. క్రమం తప్పని వ్యాయామం, కొన్ని ఆహార నియమాలతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

బాడీ మాస్‌ ఇండెక్స్‌ను లెక్కించుకుని మన వయసు, ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. అయితే ఊబకాయంతో బాధపడేవారికి వెయిట్‌ లాస్‌ జర్నీ అంత సులువు కాదు. అయితే మన ఇంట్లో సులువుగా లభించే వస్తువులతో ఎలాంటి తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా బరువును తగ్గించుకునే చిట్కా గురించి తెలుసుకుందాం.

వాముతోలాభం:ప్రాచీన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదంలో వాముకు అధిక ప్రాధాన్యత ఉంది. వామును సంస్కృతంలో ఉగ్రగంధ అంటారు. ప్రధానంగా వాము (అజ్వైన్‌)ను జీర్ణ సమస్యలకు ఎక్కువగా వాడతారు. వామును తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిక్ అనే పదార్థం విడుదలవుతుందని.. దీని వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుందంటారు నిపుణులు.

అలాగే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వాము తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారట. దీన్ని వేడి నీటిలో కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును కరుగుతంది. అలాగే ఒక టీస్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఒక టీస్పూన్ తేనె వేసి ఖాళీ కడుపుతో తాగినా ఫలితం ఉంటుంది.

అర గ్లాసు వాము నీటిని తాగితే రుతుక్రమంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

వాము తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యను కూడా అధిగమించవచ్చు.

వాంతులు, వికారం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

వాము, కరివేపాకులు, ఎండు ద్రాక్ష, చక్కెరను ఓ కప్పు నీటిలో మరిగించి తాగే తెల్లజుట్టులో మార్పు కనిపిస్తుంది.

అంతేనా జంతికలు, చక్రాలు చేసుకునేటపుడు ఆ పిండిలో కాసింత వాము జోడిస్తే, రుచి, వాసనతో పాటు అరుగుదలకు కూడా మంచిది.

నోట్‌: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే అని గమనించండి. ఏదైనా అనారోగ్య సమస్ యవస్తే వైద్యులను సంప్రదించడం మేలు.