సాధారణంగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. అదే తల్లులు వేరు ఉంటే.. ఆ అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
దానికి సెలబ్రిటీలు కూడా అతీతం ఏమికాదు . ఇండస్ట్రీలో అలాంటి అన్నదమ్ములను కూడా చూస్తూనే ఉన్నాం. కానీ, అలాంటి అన్నదమ్ముల నడుమ అక్కినేని అన్నదమ్ములు వేరు అని చెప్పాలి. అక్కినేని నాగార్జునకు ఇద్దరు కొడుకులు అన్న విషయం అందరికీ తెల్సిందే. అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్.
నాగ్ మొదటి భార్య లక్ష్మీ కొడుకు చై.. రెండో భార్య అమల కొడుకు అఖిల్. చై ఎక్కువ తల్లి లక్ష్మీ కుటుంబం అయిన దగ్గుబాటి వారి ఇంట్లోనే పెరిగాడు. అయినా అఖిల్ మాత్రం అన్న కోసం చిన్నప్పుడే అన్నతో కలిసి పెరిగాడు. ఇప్పటివరకు అన్న వెనుకనే నడుస్తూ ఉన్నాడు. చైకు సపోర్ట్ గా ఎప్పుడు అఖిల్ కనిపిస్తూనే ఉంటాడు. చై ఏది చేసినా.. అఖిల్ ఇష్టమే అని చెప్పాలి. చై మొదట సమంతను వివాహము చేసుకున్నప్పుడు.. ఆమెను అమ్మ తరువాత అమ్మలా చూసుకున్నాడు. ఎక్కడకు వెళ్లినా ఈ ముగ్గురు కలిసే వెళ్లేవారు.
వెకేషన్స్, ఈవెంట్స్ లో సమంతకు బాడీ గార్డ్ గా అఖిల్ ఉన్నాడంటే అతిశయోక్తి లేదు. అప్పుడు సమంతను అఖిల్ ను చూసినప్పుడు. రాముడు పక్కన లేనప్పుడు సీతమ్మను జాగ్రత్తగా చూసుకొనే లక్ష్మణుడు అఖిల్ అని ఫ్యాన్స్ అందరూ ప్రశంసించారు కూడా. ఇక విభేదాల నడుమ సామ్ – చై విడిపోయినప్పుడు కూడా ఒక అన్నకు.. తమ్ముడు ఏ విధంగా సపోర్ట్ గా ఉంటాడో అంతకుమించి నిలబడ్డాడు. చై గురించి పూర్తిగా తెలిసినవాడు కాబట్టి.. అన్న సంతోషం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉండేవాడు.
ఇక విడాకుల తరువాత చై.. శోభితాతో డేటింగ్ లో ఉన్నప్పటి నుంచి నిన్న పెళ్లి జరిగేవరకు.. అఖిల్ దే ఎక్కువ పాత్ర అని సమాచారం. ఇక నిన్న పెళ్ళిలో అఖిల్ అల్లరి అంతా ఇంతా కాదు. అన్న.. వదిన మెడలో మూడు ముళ్లు వేయగానే విజిల్ వేస్తూ.. చీరప్ చేశాడు. అన్న కళ్ళలో ఆనందాన్ని చూస్తూ చప్పట్లు కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లికి పుట్టకపోయినా.. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధం చూసి నెటిజన్స్, అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
కేవలం అఖిల్ మాత్రమే కాదు .. చై కూడా తమ్ముడు విషయంలో అంత బాధ్యతగా ఉంటాడు. వీరిద్దరి విషయంలో నాగ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఆ విషయాన్నీ చాలాసార్లు చెప్పుకొచ్చాడు కూడా. అఖిల్ కు మాట చెప్పాలి కానీ, చై కు అవసరం లేదు. తను ఎక్కువ మాట్లాడడు. పాయింట్ మాట్లాడి వెళ్ళిపోతాడు. అఖిల్ అలా కాదు మాటకారి అని కొడుకుల గురించి చెప్పుకొచ్చాడు. ఇక చై పెళ్లి అయ్యిపోయింది. ఇప్పుడు అందరి చూపు అఖిల్ పెళ్లి మీదనే ఉంది. ఈ మధ్యనే అఖిల్ సైతం తన కాబోయే భార్యను పరిచయం చేసాడు. తనకంటే 9 ఏళ్లు పెద్దది అయిన జైనాబ్ రావ్డ్జీ ను పెళ్లి చేసుకోనున్నాడు. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది.