మద్యం తాగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తినకండి

సాధారణంగా చాలా మంది మద్యం సేవించేటప్పుడు ఏవో ఒక స్నాక్స్ తింటుంటారు. ఆల్కహాల్ వల్ల లివర్‌కు డ్యామేజ్ అవ్వొద్దని చెప్పి ఇలా చేస్తుంటారు.


కొందరు ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటారు. అయితే మద్యం సేవించేటప్పుడు ఏది పడితే అది తినకూడదని వైద్యులు చెబుతున్నారు. అలా తినడం వల్ల లివర్‌పై ప్రభావం పడడంతోపాటు శరీరంపై కూడా దుష్ప్రభావం పడుతుందని వారు చెబుతున్నారు. ఆల్కహాల్‌ను సేవించినప్పుడు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుందని, దీంతో వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మద్యం సేవించేటప్పుడు ఏయే ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

కారం ఉండే ఆహారాలు..

చాలా మంది మద్యం సేవించేటప్పుడు కారంగా ఉండే ఆహారాలను తింటుంటారు. కానీ వాస్తవానికి ఆల్కహాల్ అనేది స్వతహాగా అసిడిటీని కలిగిస్తుంది. ఈ క్రమంలో మద్యం సేవించేటప్పుడు కారం ఉండే ఆహారాలను తింటే అసిడిటీ ఎక్కువవుతుంది. దీని వల్ల కడుపులో తీవ్రమైన మంట వస్తుంది. కాబట్టి మద్యం సేవించేటప్పుడు కారం ఉండే ఆహారాలను తినకూడదు. అలాగే మద్యం సేవించేటప్పుడు నూనె పదార్థాలను తీసుకోకూడదు. అలా చేస్తే లివర్‌లో కొవ్వు ఎక్కువగా చేరుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. కనుక మద్యం సేవించే సమయంలో నూనె పదార్థాలను కూడా తినకూడదు.

పాల ఉత్పత్తులు..

కొందరు మద్యం సేవించేటప్పుడు పాల ఉత్పత్తులను తీసుకుంటారు. చీజ్‌, జున్ను, పాలు, బటర్ మొదలైన ఆహారాలను తీసుకుంటారు. ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. ఆల్కహాల్ సేవించినప్పుడు వీటిని తీసుకుంటే జీర్ణాశయంలో అసౌకర్యం ఏర్పడుతుంది. కనుక మద్యం సేవించే సమయంలో వీటిని కూడా తీసుకోరాదు. అలాగే చీజ్ అధికంగా ఉండే పిజ్జా, పాస్తా వంటి ఆహారాలను కూడా మద్యం సేవించే సమయంలో తీసుకోకూడదు. లేదంటే అజీర్ణం వచ్చే చాన్స్ ఉంటుంది.

పల్లీలు, పప్పులు..

మద్యం సేవించేటప్పుడు చాలా మంది పల్లీలు లేదా వేయించిన పప్పులను తింటుంటారు. వాస్తవానికి ఇలా తినడం మంచిది కాదు. పల్లీలను లేదా వేయించిన పప్పులు, ఇతర ఆహారాలను తింటే శరీరంలో కొవ్వు చేరుతుంది. ముఖ్యంగా లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. లివర్ ఆరోగ్యం మందగిస్తుంది. కనుక మద్యం సేవించేటప్పుడు వీటికి కూడా దూరంగా ఉండాలి. అయితే మద్యం సేవించే సమయంలో తాజా పండ్లు, కూరగాయలు వంటి వాటిని తీసుకోవాలి. గ్రీన్ సలాడ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో లివర్ లేదా శరీరంపై పడే ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా ఆల్కహాల్ మన శరీరంపై ఎఫెక్ట్‌ను చూపించదు. దీంతో లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. మద్యం సేవించేటప్పుడు ఇలా సూచనలు పాటిస్తే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మద్యం ఎఫెక్ట్ ఎక్కువగా పడకుండా ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.