లివర్‌కు అసలైన శత్రువు మద్యం కాదు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నిపుణులు

సాధారణంగా లివర్ (కాలేయం) పాడైందంటే అందరూ ‘అతను బాగా మద్యం తాగుతాడేమో’ అని అనుకుంటారు. కానీ, తాజా పరిశోధనలు మరో భయంకరమైన నిజాన్ని చెబుతున్నాయి.


లివర్ పాడవడానికి కేవలం మద్యం మాత్రమే కాదు, మనం రోజువారీ వంటల్లో వాడే కొన్ని నూనెలు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్స్ దీనిపై స్పందిస్తూ.. మన ఇంట్లో వాడే ‘సీడ్ ఆయిల్స్’ (విత్తనాల నుంచి తీసే నూనెలు) మద్యం కంటే ప్రమాదకరమని తేల్చి చెప్పారు. ఏమిటా సీడ్ ఆయిల్స్? అవి ఎందుకు డేంజర్? ఇప్పుడు చూదాం..

మనం నిత్యం వాడే సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, మొక్కజొన్న నూనె (కార్న్ ఆయిల్), కనోలా ఆయిల్ వంటివన్నీ ఈ జాబితాలోకి వస్తాయి. ఈ నూనెలను ఫ్యాక్టరీలలో తయారు చేసేటప్పుడు విపరీతమైన వేడికి గురిచేస్తారు. అంతేకాకుండా, వీటి తయారీలో పెట్రోల్ వంటి ఇంధనాల్లో వాడే ‘హెక్సేన్’ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారట. మనం బయట తినే చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, హోటల్ భోజనాల్లో ఎక్కువగా వీటినే వాడతారు. ఇవి మన శరీరంలోని కొవ్వు కణాల్లో, లివర్‌లో ఏళ్ల తరబడి తిష్టవేసి కూర్చుంటాయి. దీనివల్ల లివర్ వాపు రావడం తో పాటు ‘ఫ్యాటీ లివర్’ సమస్య తలెత్తుతుంది.

మరి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

మీ లివర్ పదిలంగా ఉండాలంటే ప్రాసెస్ చేసిన నూనెలకు దూరంగా ఉండటం మంచిది. వంటల్లో వీలైనంత వరకు వెన్న, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బయట దొరికే జంక్ ఫుడ్, మయోనైస్ వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ ఇప్పటికే ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతుంటే, సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఉత్తమం. మన ఆహారపు అలవాట్లను కాస్త మార్చుకుంటే, ఈ ‘నిశ్శబ్ద విషం’ నుండి మన లివర్‌ను కాపాడుకోవచ్చు.

గమనిక: ఈ ఆర్టికల్‌లో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణులు మరియు వివిధ అధ్యయనాల నుండి సేకరించిన సమాచారం. ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరుగా ఉంటుంది, కాబట్టి ఆరోగ్య విషయంలో లేదా ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేయాలన్నా.. ఖచ్చితంగా మీ డాక్టర్‌ను లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.