ఆంధ్రప్రదేశ్ లోని రేషన్‌కార్డుదారులను కూటమి ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. మార్చి 31 లోపు రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని వెల్లడించింది. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఇక గతంలోనే రేషన్‌కార్డులో ఉన్న కుటుంబసభ్యులందరికి ఈ కేవైసీ చేశారు. అయితే కొంతమంది ఈ కేవైసీ చేయించుకోకపోవడంతో వారు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయలని ప్రభుత్వం సూచిస్తోంది.
ప్రభుత్వం గత రెండు నెలలుగా ఈ కేవైసీ చేయించుకోవాలని రేషన్ కార్డు ఉన్నవారికి అవగాహన కల్పిస్తుంది. కానీ పలు ప్రాంతాల్లో ప్రజలు ఉపాధి నిమిత్తం పక్క జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు సైతం వెళ్లడంతో ఈ కేవైసీ చేయించుకోలేకపోయారు. అంతే కాకుండా ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఈ కెవైసీ చేయించుకొని జాబితాలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం మళ్లీ ఈ అవకాశం కల్పిస్తుంది. ఈ కేవైసీ పూర్తి చేస్తే రేషన్ పంపిణీలో అవకతవకలకు ఆస్కారం ఉండదంటున్నారు.. రేషన్ బియ్య పక్కదారి పట్టకుండా ఉంటుందంటున్నారు.
ఇక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ కేవైసీ చేస్తున్నారు. సొంత ఊళ్లకు దూరంగా ఉన్నవారి కోసం రాష్ట్రంలో ఎక్కడైనా ఈ కేవైసీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. రేషన్ షాపులు, మీసేవ, ఆధార్ కేంద్రాల్లోనూ ఈ కేవైసీనీ నమోదు చేయించుకోవచ్చని స్పస్టం చేస్తున్నారు. చిన్న పిల్లలకు ఆధార్ కేంద్రాల్లో అప్‌డేట్ చేస్తే సరిపోతుందని వివరించారు. మరోవైపు ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే అర్హులకు కొత్త రేషన్‌కార్డులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త కార్డుల మంజూరుతో పాటు కార్డులోని కుటుంబ సభ్యుల పేర్లు, చిన్నారుల పేర్ల నమోదును కూడా చేపట్టనున్నట్టు అధికారులు ప్రకటించారు. నకిలీ కార్డుల ఏరివేతలో భాగంగా దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏపీలోనే కాకుండా పంజాబ్, బీహార్, జార్ఖండ్‌లలో ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాలలో సైతం మార్చి 31 ఈ కేవైసీకి చివరి తేదీగా నిర్ణయించారు.