బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 10లోగా ఈ పని చేయకుంటే అకౌంట్‌ క్లోజ్‌

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఖాతా ఉంటే, ఈ వార్త మీకు చాలా ముఖ్యం. 10 ఏప్రిల్ 2025 నాటికి నో యువర్ కస్టమర్ (KYC)ని అప్‌డేట్ చేయాలని బ్యాంక్ తన కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది.


ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచనల మేరకు జరుగుతోంది. 31 మార్చి 2025 నాటికి KYCని అప్‌డేట్ చేయని ఖాతాదారులకు ఇది తప్పనిసరి.

KYC ని ఎలా అప్‌డేట్ చేయాలి?

మీరు మీ KYC ని అప్‌డేట్ చేయాలనుకుంటే, మీరు కింది పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా మీ గుర్తింపు కార్డు, చిరునామా రుజువు, ఇటీవలి ఫోటో, పాన్ కార్డ్ / ఫారం 60, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్ తీసుకొని మీ సమీప పీఎన్‌బీ శాఖకు వెళ్లి మీ KYCని అప్‌డేట్‌ చేసుకోవాలి.

PNB ONE యాప్ ద్వారా – మీరు ఇంటి నుండే ఆన్‌లైన్‌లో KYC ని అప్‌డేట్ చేయవచ్చు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ (IBS) ద్వారా – PNB ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి కేవైసీ అప్‌డేట్ ఎంపికను ఎంచుకోండి.

రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా – మీరు మీ హోమ్ బ్రాంచ్‌కు కేవైసీ పత్రాలను పంపవచ్చు.

కేవైసీ అప్‌డేట్ చేయకపోతే ఏమి జరుగుతుంది?

కస్టమర్లు ఏప్రిల్ 10, 2025 నాటికి కేవైసీ అప్‌డేట్ పొందకపోతే వారు తమ ఖాతా నుండి ఎటువంటి లావాదేవీలు చేయలేరు. బ్యాంక్ ఖాతాపై తాత్కాలిక నిషేధం విధిస్తారు. దీని కారణంగా మీరు డబ్బు జమ చేయలేరు లేదా ఉపసంహరించుకోలేరు.

కేవైసీ స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

మీ కేవైసీ అప్‌డేట్‌ అయ్యిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ దశలను అనుసరించండి:

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వండి.
వ్యక్తిగత సెట్టింగ్‌లకు వెళ్లి కేవైసీ స్థితిని తనిఖీ చేయండి.
అప్‌డేట్‌ అవసరమైతే స్క్రీన్‌పై ఒక సందేశం కనిపిస్తుంది.
PNB ONE యాప్ నుండి eKYC ఎలా చేయాలి?

PNB ONE యాప్‌కి లాగిన్ అవ్వండి.
కేవైసీ స్థితిని తనిఖీ చేయండి.
అప్‌డేట్ అవసరమైతే, ఇచ్చిన సూచనలను అనుసరించి కేవైసీని అప్‌డేట్ చేయండి.