రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి రూ. 2 వేలు.. ఎప్పుడంటే

www.mannamweb.com


రైతన్నల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. పెట్టబడి సాయం అందిచండంతో పాటు.. పండించిన పంటకు కనీస మద్దతు ధర, ప్రక్రుతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు బీమా సాయం, రైతు రుణ మాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఎప్పుడు.. ఎందుకంటే..

అన్నదాతలను ఆదుకోవడం కోసం మోదీ సర్కార్ కొన్నాళ్ల క్రితం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతులకు ఆర్థిక సాయం అందించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. చిన్న,సన్నకారు రైతుల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఈ స్కీంను తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. ఏడాదికి మూడు విడతల్లో అందిస్తోంది.

ప్రతి నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున 3 విడతల్లో కిసాన్ సమ్మాన్ నిధులను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు 16 విడతల్లో ఒక్కొక్కరికి మొత్తం రూ. 32,000 అందించింది. ప్రస్తుతం అన్నదాతలు 17వ విడత కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా 16వ విడత నిధుల్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28న మహారాష్ట్ర యావత్మాల్ వేదికగా విడుదల చేశారు. సుమారు 9 కోట్ల మంది రైతుల ఈ పథకం కింద లబ్ధి పొందారు.

తాజాగా కిసాన్ 17వ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది మే ఆఖరి వారంలో ఇవి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మే చివరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది.

అయితే ఇ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే 17వ విడత డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది. కిసాన్ నిధుల పొందాలంటే.. ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. కేవైసీ పూర్తి చేసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లొచ్చు. అక్కడ ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా దీనిని పూర్తి చేయొచ్చు. ఇంకా.. pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.