Driving License: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై ఆర్‌సీ, లైసెన్స్‌తో పన్లేదు.. ఇదొక్కటి ఉంటే చాలు..

www.mannamweb.com


గతంలో డ్రైవింగ్ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు రూల్స్ అన్నీ మారాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం కష్టం.

నడిపే వ్యక్తి దగ్గర లైసెన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఇలా అన్ని పత్రాలు ఉండాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. ఒకవేళ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా చెల్లించాల్సిందే.

పైన పేర్కొన్న పత్రాలు ఏవి లేకుండా ట్రాఫిక్ పోలీసులకు మీరు దొరికినట్లయితే.. రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది.

అందుకే వాహనాలు నడిపేవారికి వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండటం తప్పనిసరి. అయితే మీకు ఇప్పుడొకటి చెప్పబోతున్నాం. ఈ ఒక్క యాప్ మీ దగ్గర ఉంటే.. లైసెన్స్, ఆర్‌సీ లేకపోయినా మీకు చలానా వేయరు.

డిజిటల్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని వాహనం నడపటానికి అవసరమైన అన్ని పత్రాలను ఒకే చోట పొందేలా పలు యాప్‌లు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అవే Digilocker, mParivahan మొబైల్ యాప్‌లు.

ఈ యాప్‌లలో మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. అవసరమైనప్పుడు ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు రెండూ అధికారికమైనవి, దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేవి.

హార్డ్ కాపీని ఉంచాల్సిన అవసరం లేదు..

మీరు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ ఈ పత్రాలు ఏవీ లేకుండా, పట్టుబడితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల, మీ వాహనాన్ని రోడ్డుపైకి తీసుకెళ్లే ముందు, మీ వద్ద అవసరమైన అన్ని పత్రాలు అందుబాటులో ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి.

కానీ భారతదేశం డిజిటల్‌గా మారుతున్నందున, డ్రైవింగ్‌కు అవసరమైన పత్రాల హార్డ్ కాపీలు లేకపోయినా ఫర్లేదు. మీరు డిజిలాకర్, mParivahan మొబైల్ యాప్‌లో అన్ని ముఖ్యమైన పత్రాలను సులభంగా పొందొచ్చు.

కాగా, 2018 సంవత్సరంలో, భారత ప్రభుత్వ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ డిజిలాకర్, mParivahan మొబైల్ యాప్‌లలో అప్‌లోడ్ చేసిన పత్రాలను అసలైనవిగా నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసింది.