బ్యాంక్‌ లోన్లు తీసుకున్న వారికి అలర్ట్.. RBI గవర్నర్ కీలక ప్రకటన!

www.mannamweb.com


భారతీయ రిజర్వ్ బ్యాంక్ నేడు కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. 7వ సారి కూడా రెపో రేటును ఏమాత్రం మార్చలేదు. రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఆరు మంది సభ్యులతో ఏప్రిల్ 3 వ తేదీన ప్రారంభమైన ఆర్బీఐ మొనెటరీ పాలసీ కమిటీ సమావేశం ఈరోజు (శుక్రవారం, ఏప్రిల్5) తో ముగిసింది. తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తాజా ద్రవ్య విధాన ప్రకటన సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆర్ధిక వ్యవస్థపై కీలక విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కీలకమైన రేట్లపై ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను ఆయన తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం రెపో రేటు యథాతథంగా ఉంచేందుకు ద్రవ్య పరపతి కమిటీ ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. కొంత కాలంగా ఆర్థిక వృద్ది గాడిలో పడిందని.. అన్ని అంచనాలు దాటివేస్తున్నామని అన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ఇక డిసెంబర్ నాటికి 5.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం 2 మాసాల్లో 5.1 శాతనికి తగ్గింది అని తెలిపారు. ఈ క్రమంలో జీడీపీ అంచనాల గురించి ఆయన కీలక ప్రకటన చేశారు. 2024-25 సంవత్సరానికి గాను జీడీపీ వృద్ది రేటు ఏడు శాతం ఉంటుందని అంచనా వేశారు. ఈ ఏడాది జూన్ మాసానికి ఆర్బీఐ మొనేటరీ పాలసీ కమిటీ తదుపరి సమావేశం ఉంటబోతుందని తెలిపారు.

అప్పటి వరకు ఇదే రెపో రేట్ కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్భణం తమ టార్టెట్ కి దగ్గరగానే ఉందని అన్నారు. కోర్ ద్రవ్యోల్భణం గత తొమ్మిది నెలలుగా దిగివస్తుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుత ద్రవ్యోల్భణం రేటు, యూఎస్ ఫెడ్ నుంచి వస్తున్న సంకేతాలను బట్టి మన దేశంలో వడ్డీ రేట్లను తగ్గించే శుభవార్త ఉంటుందని అందరూ భావించారు. దీని వల్ల ఈఎంఐ భారం కొంత మేర తగ్గుతుండొచ్చని భావించారు. కానీ వడ్డీ రేట్లు యధాతథం అనే వార్త రావడంతో బ్యాంక్ లోన్లు తీసుకున్న వారికి ఏడోసారి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.