ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లకు అలర్ట్.. ఎన్నికల సంఘం కీలక సూచనలు

www.mannamweb.com


మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అటు లోక్‌సభకూ, ఇటు అసెంబ్లీకీ 2 ఓట్లు వెయ్యాల్సి ఉంటుంది. అందువల్ల ఏపీలో ఎన్నికల ప్రక్రియ పెద్దదే.
అందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది. అది వచ్చేస్తే, ఇక బాధ్యత అంతా ఓటరుపైనే ఉంటుంది. అందుకే ఓటర్లు కూడా ఇప్పటికే ఎవరికి ఓటు వెయ్యాలో ఆలోచించుకొని.. రెడీగా ఉన్నారు.

ఇప్పుడు ఓటర్ల ముందు పెద్ద పనే ఉంది. వారు తమ ఓటు ఉందో, పోయిందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే.. ఆమధ్య కొన్ని ఓట్లను తొలగించారు. అలా తొలగించిన వాటిలో పొరపాటున వారి ఓటు కూడా పోయిందేమో చూసుకోవాలి. ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ఓ సమస్యా ఉండదు. లేకపోతే మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి, తిరిగి తమ పేరు నమోదయ్యేలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకో తాము ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఆల్రెడీ ఓటర్ల జాబితా రిలీజ్ అయ్యింది. దీన్ని మనం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లో కూడా యాప్ ద్వారా చూసుకోవచ్చు. అందువల్ల మనం ఇప్పుడు మన పేరు ఉందో లేదో చూసుకోవడానికి పోలింగ్ బూత్‌కి వెళ్లాల్సిన పని లేదు. ఓటర్ ఐడీ కార్డు ఉన్న వారు.. దానిపై ఉండే ఎపిక్ నంబర్ ద్వారా తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇలా తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. 1.SMS ద్వారా తెలుసుకోవచ్చు. 2. EC హెల్ప్ లైన్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

SMS ద్వారా ఎలా తెలుసుకోవాలి?:

ముందుగా మీరు నమోదు చేయించుకున్న మొబైల్ ఫోన్ నుంచి SMS రూపంలో ఎపిక్ ఐడీ నంబర్‌ను ఎంటర్ చేసి.. 1950కి మెసేజ్ పంపాలి. కాసేపటికే ట్రింగ్ మని మీకు ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే, మీ పోలింగ్ బూత్ నంబర్, పేరు, అడ్రెస్ వివరాలు ఉంటాయి. మెసేజ్ రాకపోతే, మీకు ఓటు లేనట్లే.
హెల్ప్‌లైన్ ద్వారా ఎలా తెలుసుకోవాలి?

మీరు టోల్ ఫ్రీ నంబర్ 1950కి కాల్ చెయ్యాలి. మీకు ఓ వాయిస్ వినపడుతుంది. అది.. మిమ్మల్ని భాష ఎంచుకోమని చెబుతుంది. మీరు భాష ఎంచుకున్నాక, మీరు ఓటర్ ఐడి స్టేట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఎపిక్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. ఆ తర్వాత మీరు పోలింగ్ బూత్ నంబర్, పేరు, అడ్రెస్ వివరాలు పొందుతారు.

ఓటరు కార్డు లేకపోతే ఎలా?

మీ దగ్గర ఓటరు కార్డు లేకపోతే, మీకు ఎపిక్ నంబర్ తెలియదు. అప్పుడెలా అనే డౌట్ మీకు రావచ్చు. అప్పుడు మీరు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (Voter Helpline) ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ మీకు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే, మీ మొబైల్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. తర్వాత మీ పేరు, పుట్టిన రోజు ఇలా రకరకాల మార్గాల ద్వారా సెర్చ్ చేసి, మీ ఓటును కనుక్కోవచ్చు. అప్పుడు మీ ఎపిక్ ఐడీ నంబర్ కూడా మీకు తెలుస్తుంది. ఎక్కడ ఓటు వెయ్యాలో వివరాలు లభిస్తాయి.