Breaking News : టీడీపీలో చేరిన ఆళ్ళ నాని

వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రి పసుపు కండువా కప్పుకున్నారు. ఏలూరుకు చెందిన వైసీపీ మాజీ మంత్రి ఆళ్ల నాని గురువారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నానికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆళ్ల నాని గత ఏడాది ఆగస్టులో పార్టీకి రాజీనామా చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎంగా, ఆరోగ్య మంత్రిగా నాని ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత, ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఆగస్టులో పార్టీకి, అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల టీడీపీ పాదయాత్ర చేపట్టింది.