Andhra news: మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు…కేటాయించిన బ్లాక్స్ ఇవే

డిప్యూటీ సీఎం, మంత్రులకు ఛాంబర్‌లను కేటాయిస్తూ సాధారణ పరిపాలనశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.


అమరావతి: డిప్యూటీ సీఎం, మంత్రులకు ఛాంబర్‌లను కేటాయిస్తూ సాధారణ పరిపాలనశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

బ్లాక్‌-2లో ఏడుగురు, బ్లాక్‌-3లో ఐదుగురు, బ్లాక్‌ -4లో ఎనిమిది మంది, బ్లాక్‌-5లో ఐదుగురు మంత్రులకు ఛాంబర్లను కేటాయించింది.

బ్లాక్‌-2లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నాదెండ్ల మనోహర్‌, నారాయణ, కందుల దుర్గేశ్‌, అనిత, పయ్యావుల కేశవ్‌, ఆనం రామనారాయణరెడ్డిల ఛాంబర్లు ఉంటాయి.

బ్లాక్‌-3లో మంత్రులు గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎన్‌ఎండీ ఫరూక్‌లకు,

బ్లాక్‌-4లో అనగాని సత్యప్రసాద్‌, అచ్చెన్నాయుడు, సవిత, టీజీ భరత్‌, లోకేశ్‌, రాం ప్రసాద్‌రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడుకి కేటాయించారు.

బ్లాక్‌-5లో బీసీ జనార్థన్‌రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్‌, వాసంశెట్టి, సత్యకుమార్‌ల ఛాంబర్లు ఉంటాయని సాధారణ పరిపాలనశాఖ తెలిపింది.