👨🏫హైస్కూల్ ప్లస్ లో బోధనకు ఎస్ఏల కేటాయింపు
🌻ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 210 హైస్కూల్ ప్లస్ ల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు స్కూల్ అసి స్టెంట్ల(ఎస్ఏ)ను కేటాయించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
గత ప్రభుత్వం మండలానికో కో-ఎడ్యుకేషన్ కళాశాల, బాలికలకు ప్రత్యేక కళాశాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది.
కో-ఎడ్యుకేషన్ కళాశాలల ఏర్పాటుకు ఎన్నికల ముందు ఉత్త ర్వులు ఇవ్వడంతో ఈ విద్యా సంవ త్సరం నుంచి వాటిని ప్రారంభించారు.
వీటిల్లో పాఠాలు చెప్పేందుకు గత ప్రభుత్వం అధ్యాపకులను నియమించ లేదు.
పోస్టులను మంజూరు చేయ లేదు. దీంతో పాఠశాల విద్యాశాఖ స్కూల్ అసిస్టెంట్లను కేటాయించాలని కోరింది.
ఆయా బడుల్లో ఉన్న వారిని సర్దుబాటు చేయాలని సూచించింది.