మీ క‌ళ్లు ఎప్ప‌టికీ ఆరోగ్యంగా ఉండలా? అయితే ఈ టిప్స్ పాటించండి

www.mannamweb.com


అప్పట్లో 90 ఏళ్లు వ‌చ్చినా కంటి చూపులో ఏమాత్రం తేడా ఉండేది కాదు. కానీ ఈరోజుల్లో చిన్న‌త‌నం నుంచే క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సిన దుస్థితి నెల‌కొంది. దీనికి కారణం ఏంటి? మీ క‌ళ్లు ఎప్ప‌టికీ ఆరోగ్యంగా ఉండలా? అయితే ఈ టిప్స్ పాటించండి

పూర్వ కాలంలో మ‌న పెద్ద‌లు 90 ఏళ్లు వ‌చ్చినా కంటి చూపులో ఏమాత్రం తేడా ఉండేది కాదు. కానీ ప్ర‌స్తుతం చిన్న‌త‌నం నుంచే క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సిన దుస్థితి నెల‌కొంది. దీనికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. మారిన జీవ‌న‌శైలి ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా కంప్యూట‌ర్లు, ఫోన్లు, టీవీ తెర‌ల‌ను అధికంగా చూడ‌డం, పోష‌కాహార లోపం వ‌ల్లే చాలా మంది కంటి చూపు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. అలాగే చాలా మందికి క‌ళ్ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఇక 40 ఏళ్ల వ‌య‌స్సు దాటితే చాలా మందికి క‌ళ్ల‌లో శుక్లాలు వ‌స్తున్నాయ‌ని కంటి వైద్యులు చెబుతున్నారు..అయితే రోజువారి దిన‌చ‌ర్య‌లో భాగంగా కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే క‌ళ్ల‌ను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. క‌ళ్ల‌లో శుక్లాలు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. అలాగే కంటి చూపు మెరుగు ప‌డుతుంది. ఇక ఆ జాగ్ర‌త్త‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కంటి చూపు లోపించేందుకు, క‌ళ్ల స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు ముఖ్య కార‌ణం పోష‌కాహార లోప‌మే.. క‌నుక పోష‌కాలు అధికంగా ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటుండాలి. ముఖ్యంగా విట‌మిన్లు ఎ, సి, ఇల‌తోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను కూడా తినాలి. క్యారెట్లు, ఆకు ప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, చేప‌ల‌ను త‌ర‌చూ తింటుంటే పైన చెప్పిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. దీంతో క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు ప‌డుతుంది. ఇక కంప్యూట‌ర్‌ల ఎదుట గంట‌ల త‌ర‌బ‌డి ప‌నిచేసేవారికి ఈ టిప్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. కంప్యూట‌ర్ల ఎదుట కూర్చునే వారు ప్ర‌తి 20 నిమిషాల‌కు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉండే ఏదైనా వ‌స్తువును క‌నీసం 20 సెక‌న్ల పాటు చూడాలి. దీన్నే 20-20-20 టెక్నిక్ అంటారు. ఈ చిట్కా వ‌ల్ల క‌ళ్ల‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది. దీంతో క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

బ‌య‌ట ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగేవారు క‌ళ్ల‌కు ర‌క్ష‌ణ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు గాను కూలింగ్ గ్లాసెస్‌ను ఉప‌యోగించాలి. ఇవి అతినీల‌లోహిత కిర‌ణాల ప్ర‌భావం కళ్ల‌పై ప‌డ‌కుండా క‌ళ్ల‌ను ర‌క్షిస్తాయి. దీంతో క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. దీనికి తోడు ప్ర‌తి ఏడాది క‌చ్చితంగా కంటి వైద్యుల‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. సాధార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డే కొద్దీ క‌ళ్ల‌లో శుక్లాలు వంటివి వ‌స్తుంటాయి. కంటి చూపు కూడా మంద‌గిస్తుంది. అలాగే గ్ల‌కోమా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఏడాదికి ఒక‌సారి అయినా స‌రే ఈ టెస్టుల‌ను చేయించుకోవాలి. ఏదైనా స‌మ‌స్య ఉన్న‌ట్లు తేలితే వెంట‌నే చికిత్స తీసుకోవాలి. దీంతో క‌ళ్ల‌ను ఆరోగ్య‌ంగా, సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. రాత్రిపూట నిద్ర‌కు ముందు చాలా మంది ఫోన్ల‌ను ఎక్కువ‌గా చూస్తుంటారు. చీక‌ట్లో ఫోన్ చూడ‌డం వ‌ల్ల ఫోన్ వెలుతురు క‌ళ్ల‌పై ప‌డి క‌ళ్లు ఒత్తిడికి గుర‌వుతాయి. దీంతో క‌ళ్ల‌లోని ద్ర‌వం ఆవిరై పోతుంది. క‌ళ్లు పొడిబారి దుర‌ద పెడ‌తాయి. క‌నుక క‌ళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి పూట ఫోన్ల‌ను త‌క్కువ‌గా వాడాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఇలా ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటించడం వ‌ల్ల క‌ళ్ల‌ను ఎల్ల‌వేళ‌లా సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు.