మెటా ఏఐలో అదిరిపోయే ఫీచర్లు.. ఇక ఆ పనులన్నీ సులభం!

www.mannamweb.com


వాట్సాప్ సరి కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో ఫీచర్లని తీసుకొచ్చింది. వాటిల్లో మెటా ఏఐకి వచ్చిన ఆదరణ అంతా ఇంత కాదు. ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ సహాయంతో చాలా ఈజీగా మన డౌట్ లకు సొల్యూషన్స్ పొందవచ్చు. తాజాగా ఆ మెటా ఏఐని ఇంకా అభివృద్ధి చేసింది వాట్సాప్. అందులోనే మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి సాయంతో మనం ఇంకా ఈజీగా సమాధానాలు పొందవచ్చు. ఇంతకీ ఆ కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి వల్ల ఉపయోగం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మాములుగా మనకు ఏదైనా డౌట్ ఉంటే ఏం చేస్తాం.. మెటా ఏఐ చాట్‌ను ఓపెన్ చేసి ఆ డౌట్ గురించి టెక్స్ట్ చేస్తాం. అయితే తాజాగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ సాయంతో ఇంకా సులభంగా సమాధానం పొందవచ్చు. మన డౌట్ కి సంబంధించిన ఫొటో సెండ్ చేస్తే చాలు వెంటనే సమాధానం వస్తుంది. ఉదాహరణకు మనకు తెలియని భాషలో ఏదైనా ఫొటో ఉందని అనుకుందాం. ఆ ఫొటోను సెండ్ చేసి దాని అర్థం ఏంటని అడగితే వెంటనే కావాల్సిన సమాధానం వచ్చేస్తుంది. దీంతో మన పని ఇంకా సులభం అవుతుంది.

అలాగే మన ఫొటోలు ఒక్కోసారి సరిగ్గా రావు. వాటిని సులభంగా ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది మెటా. ఈ ఫీచర్‌ సాయంతో ఫొటోలను మనకు ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇందులో మనం ఏదైన ఫొటో పంపి అందులోని రంగులను మార్చాలని కమాండ్ ఇస్తే చాలు వెంటనే మార్చేస్తుంది. ఇంకా అంతేకాకుండా బ్యాగ్రౌండ్‌లో ఉన్న వస్తువులను తొలగించాలన్నా ఈజీగా తొలగించేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌లో ఉంది. దీన్ని పూర్తిగా టెస్ట్ చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్‌ సహాయంతో ఇకపై ఫొటో ఎడిటింగ్ కోసం ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. మనం చక్కగా వాట్సాప్ లోనే మన ఫోటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు.

ఇక మెటాతో రియల్ టైమ్‌లో సంభాషణలు జరిగేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. ఇందులో మనం ఏ ప్రశ్నలకు అయిన సులభంగా సమాధానాలు తెలుసుకోవచ్చు. మనం ఏదైనా కష్టమైన ప్రశ్న అడిగితే దాని గురించి స్పష్టంగా వివరిస్తుంది. అత్యంత వేగంగా సమాధానాలు ఇస్తుంది. దీంతో మీరు నేరుగా కష్టమైన ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు తెలుసుకోవచ్చు. ఇంకా అంతేకాదు ఈ ఏఐ మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది కూడా. ఇది మీతో జోకులను షేర్ చేసుకుంటుంది. అంతేకాదు మెటా ఏఐ వాయిస్‌ని కూడా మార్చుకునే ఫీచర్ కూడా ఇందులో ఉంది. కొందరు ప్రముఖుల వాయిస్‌ను కూడా దీనిలో సెట్ చేసుకోవచ్చు. దాంతో మీకు నచ్చిన వాయిస్ సెట్ చేసుకొని ఈ ఫీచర్ ని వినియోగించుకోవచ్చు.