అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ రిలీజ్ చేసిన జియో.. అన్‌లిమిటెడ్ సేవలు ఆశ్వాదించాల్సిందే.

www.mannamweb.com


భారతదేశంలోని టెలికం కంపెనీలన్నీ ఇటీవల రీచార్జ్ ప్లాన్స్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తప్ప అన్ని కంపెనీలు రీచార్జ్ ప్లాన్స్ ధరలను దాదాపు 20 నుంచి 30 శాతం వరకు పెంచాయి.

ఈ నేపథ్యంలో సగటు వినియోగదారుడు తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో జియో సైలెంట్‌గా మరో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.198 ధరతో అపరిమిత సేవలను అందించే కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇతర టెలికం కంపెనీలకు పోటినిచ్చేలా జియో రిలీజ్ చేసిన నయా ప్లాన్ గురించి వివరాలను తెలుసుకుందాం.

కొత్త రూ. 198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పటికే జియో వెబ్‌సైట్‌లో లైవ్‌లో ఉంది. ఇది కంపెనీకు సంబంధించిన అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్స్ జాబితాలో దిగువన ఉంది. దీని స్థానంలో రూ. 349 ప్లాన్ అర్హత ఉన్న పరికరాలలో అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించడానికి అత్యంత సరసమైన మార్గమని అందరూ అనుకున్నారు. అయితే రూ. 198 ప్లాన్ ద్వారా ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2 జీబీ 4జీ డేటాను అందిస్తుంది. అలాగే ఇతర ప్లాన్‌ల మాదిరిగానే డేటా అయిపోయిన తర్వాత వేగం 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. డేటాతో పాటు రిలయన్స్ జియో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో జియో క్లౌడ్, జియో టీవీ, జియో వంటి యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే.

అయితే ఇవే ప్రయోజనాలతో జియో రూ.349 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కానీ, త్వరలోనే ఆ ప్లాన్ జియో అందించే అవకాశం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో గట్టిపోటీనిచ్చే ఎయిర్‌టెల్ ఈ ధరలో ఎలాంటి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందించదు. ఎయిర్‌టెల్ అపరిమిత 5జీ ప్లాన్ ప్రారంభ ధర రూ. 379గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో ఎక్స్‌ట్రీమ్ ప్లే, వింక్ మరియు హలో ట్యూన్స్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.