Amazon Forest- అమెజాన్ అడవి గురించి మీకు తెలియని భయంకరమైన వాస్తవాలు….తప్పక చదవాల్సిన కథనం….

www.mannamweb.com


అమెజాన్ అడవి గురించి మీకు తెలియని భయంకరమైన వాస్తవాలు

# అమెజాన్ అడవులు సౌత్ అమెరికా లో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవులు దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది.
దాదాపు 60 % అంటే ఈ అడవుల విస్తీర్ణం లో రెండవ వంతు బ్రెజిల్ లో విస్తరించి ఉంది. పెరూ, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఈక్వడార్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా లలో విస్తరించి ఉన్నాయి ఈ అడవులు.
# మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్ లో 20 % ఆక్సిజన్ అమెజాన్ అడవులలో నుండే ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ అడవులని The Lungs of the Earth అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారు. అలాగే ఈ అడవులని విపరీతం గా కాల్చడం వల్ల దాదాపు 30 % కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది.
# దట్టమైన చెట్ల ఆకుల వల్ల ఈ అడవి చాల చీకటి గా ఉంటుంది. ఈ అడవులలోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టం గా ఉండటం వల్ల వర్షం నేల మీద చేరడానికి దాదాపు 10 నిముషాలు పడుతుంది ,అంటే ఈ అడవులు ఎంత దట్టం గా ఉంటాయో మనకి అర్ధమౌతుంది కదా.
# ప్రపంచం లో ఉన్న మొత్తం వర్షాధార అడవులలో సగ భాగం అమెజాన్ అడవులే. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉత్పత్తి చేసే మెడిసిన్స్ లో దాదాపు 25 %, ఈ అడవుల లో పెరిగే మొక్కల నుండే సేకరించి తయారు చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఉన్న చెట్ల లో కేవలం 1 % చెట్లని పరిశోధించి తయారు చేసినవి.
# మనం తినే ఆహార పదార్ధాలైన కాఫీ, చాక్లెట్, రైస్, టొమాటోస్, పొటాటోస్, అరటి, మిరియాలు, పైన్ ఆపిల్స్, కార్న్ లలో 80% కంటే ఎక్కువ గా ఈ అడవుల నుండే లభిస్తున్నాయి.
# ఈ అడవులలో దాదాపు 400 – 500 ఆటవిక జాతులు నివశిస్తున్నాయి. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచం తో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు కానిబాల్స్. అంటే మనుషులని తింటారు అన్నమాట.
# గత 40 సంవత్సరాలలో దాదాపు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి.
# అమెజాన్ అడవి మొత్తం విస్తీర్ణం 55,00,000 చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు ఆర్జెంటినా దేశానికి రెండింతలు. ఒకవేళ ఈ అడవులు ఒక దేశం అయితే కనుక, ప్రపంచం లోనే 9 వ అతి పెద్ద దేశం గా ఉండేది.
# సహారా ఎడారి లో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి, అమెజాన్ అడవులలో పడి, ఇక్కడి మట్టి తో కలిసి నేల సారవంతమౌతుంది. దీనివల్ల కొత్త కొత్త మొక్కలు పెరుగుతున్నాయి.
# 55 మిలియన్ సంవత్సరాల నుండి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఉంది. 11,200 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రజలు నివశించారు.
# ప్రపంచం లోనే రెండో అతి పెద్ద నది అమెజాన్ రివర్. ఈ అడవుల మధ్య నుండే ప్రవహిస్తుంది. ఈ నది ప్రపంచం లో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా 5 ఇంతలు ఎక్కువ నీరు విడుదల చేస్తుంది. కానీ దీని మీద ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదు. బ్రెజిల్ లో ఈ నది ఒక 4 కిలోమీటర్లు underground లో ప్రవహిస్తుంది.
# ఈ అమెజాన్ రివర్ పశ్చిమ నుండి తూర్పు కి ప్రవహిస్తుంది. కానీ 1987 లో ఇది రివర్స్ లో అంటే తూర్పు నుండి పశ్చిమ కి ప్రవహించింది.
# ఈ అమెజాన్ అడవులలో దాదాపు 390 బిలియన్ చెట్లు అంటే 390 కోట్ల చెట్లు, అలాగే 40000 వృక్ష జాతులు, 2200 చేప జాతులు, 1200 పక్షి జాతులు, 420 క్షిరద జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు నివశిస్తున్నాయి.
# ఈ అడవులలో మనకి తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకి తెలిసిన అనకొండ, జాగ్వర్, ప్యూమా, స్పైడర్ మంకీ, బ్లూ poison మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఇక్కడే ఉన్నాయి.
# ఈ అడవులలో విషపూరితమైన పిరాన్హ చేపలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్స్ ఇంకా అనేక రకాలైన చేపలు ఉన్నాయి.
# ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచం లోనే అతి పెద్ద ఆకు గా పేరు గాంచింది. ఇది కూడా ఈ అడవులలోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి. 40 కేజీల బరువు వరకు మోయగలవు.
# అమెజాన్ అడవులలో 2.5 మిలియన్ కీటకాలు నివశిస్తాయి. ఇక్కడ పెరిగే ఆమెజానియాన్ butterfiles తాబేళ్ల కన్నీళ్లు తాగి బ్రతుకుతాయి.
# ఈ అడవులలో దాదాపు 207 పక్షి రకాలు ఉండగా, వాటిలో ప్రపంచం లోనే అతి బిగ్గర గా అరిచే, టౌకెన్ అనే పక్షి ఈ అడవులలోనే ఉంది. దీని కూత దాదాపు అర మైలు దూరం వరకు వినిపిస్తుంది. అలాగే రంగు రంగుల చిలకలు, హొయజిం అనే పక్షి , కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి….దీనినే కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగో గా వాడుతున్నారు. ఇంకా అనేక రకాలైన పక్షులు ఇక్కడ ఉన్నాయి.
# ఈ అడవుల లోనే రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఉంది. ఇక్విటోస్ అనే ఈ నగరం, పెరూ దేశం లో ఉంది. ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉంది. ఇక్కడ సుమారు గా 400000 మంది నివశిస్తున్నారు.