అమెజాన్ ఇవాళ్టి నుంచి భారత్ మార్కెట్ లో ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది. మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్ పేరుతో (Amazon Mega Electronics Days Sale 2025) ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 16 వ తేదీ వరకు జరగనుంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌వాచ్ లు, ట్యాబ్లెట్ లు, ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్ పై భారీ డిస్కౌంట్ లను పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా వివిధ రకాల ఉత్పత్తులపై గరిష్ఠంగా 80 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఈ బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ఆఫర్లు : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్ లో భాగంగా HDFC, IDFC, యాక్సెస్ బ్యాంకు కార్డులను వినియోగించి కొనుగోలు చేస్తే గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ సేల్ లో భాగంగా బ్లూటూత్ స్పీకర్లు, కెమెరాలు, ప్రీమియం ఇయర్‌బడ్స్ ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ ఆఫర్లు, బ్యాంకు డిస్కౌంట్ ల పూర్తి వివరాలు.
స్మార్ట్‌వాచ్‌లపై ఆఫర్లు : అమెజాన్ సేల్ లో భాగంగా నాయిస్ ప్రో 6, ఆపిల్ వాచ్ SE సహా మరెన్నో స్మార్ట్‌వాచ్‌లను డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. నాయిస్ ప్రో 6 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.5,999 గా ఉంది. 1.85 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ వాచ్ EN2 ప్రాసెసర్, Nebula UI 2.0 తో పనిచేస్తోంది. ఆపిల్ వాచ్ SE (GPS – 40mm) ధర రూ.19899, 44mm ధర రూ.22,399 గా ఉంది. ఈ వాచ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫిట్‌నెస్ మరియు స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్ వంటి అనేక హెల్త్ ఫీచర్ లను కలిగి ఉంది. వీటితోపాటు ఎమర్జెన్సీ SOS, ఫాల్ డిటెక్షన్ సహా వర్కౌట్ మెట్రిక్స్ వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.
ల్యాప్‌టాప్ ఆఫర్లు : ఈ సేల్ లో భాగంగా గేమింగ్ సహా ఇతర ల్యాప్‌టాప్‌లను డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. Asus TUF గేమింగ్ A15 AMD రైజన్ , లెనోవా ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 i7 ల్యాప్‌టాప్, ASUS ROG Strix G16, HP, Acer సహా మరెన్నో బ్రాండ్ల ల్యాప్‌టాప్ లను సొంతం చేసుకోవచ్చు.
ట్యాబ్లెట్ డీల్స్ : అమెజాన్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో భాగంగా శాంసంగ్ ట్యాబ్ S9 FE, షియోమీ ప్యాడ్ 7, వన్‌ప్లస్ ప్యాడ్ గో, లెనోవో ట్యాబ్ ప్లస్ సహా ఆపిల్ సహా ఇతర బ్రాండ్‌ల ట్యాబ్లెట్ లను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఇయర్‌బడ్స్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3, వన్‌ప్లస్ బడ్స్ 3, సోనీ WH-1000XM4 వంటి బడ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బ్లూటూత్ స్పీకర్ లను కూడా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో భాగంగా సోనీ, బోట్, JBL సహా మరిన్ని బ్రాండ్ లపై డిస్కౌంట్ లను పొందవచ్చు. బోట్ స్టోన్ 650 10W, బోట్ స్టోన్ 580 బ్లూటూత్ స్పీకర్ 12W సహా మివీ ఫోర్ట్ H30 పోర్టబుల్ 30W సౌండ్‌బార్ ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.