ఈవీలపై దీపావళి బంపర్ ఆఫర్.. ఏథర్ స్కూటర్లపై అదిరే తగ్గింపులు

www.mannamweb.com


దేశంలో పండగల సీజన్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ పండగల కోసం సొంత గ్రామాలకు వచ్చారు.

దీంతో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. పండగ అంటే కొత్త దుస్తులు, పిండి వంటలు, సంబరాలు ఉత్సాహంగా జరుగుతాయి. అయితే పండగ సందర్భంగా కొత్త వస్తువులను కొనడం మన భారతీయులకు అలవాటు. ముఖ్యంగా స్కూటర్లు, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఏథర్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకుని దాదాపు 25 వేల రూపాయల తగ్గింపు పొందే అవకాశం కల్పించింది. పండగ సందర్బంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

దీపావళి ఆఫర్

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సంస్థకు వినియోగదారుల ఆదరణ బాగుంది. ఈ కంపెనీ విడుదల చేసే వాహనాలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. అధునాతన ఫీచర్లు, కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్నాయి. దీపావళి నేపథ్యంలో ఏథర్ కు చెందిన 450 ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో భాగంగా 450 ఎక్స్ కొనుగోలు చేసిన వారికి అదనపు ఖర్చు లేకుండా 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ లభిస్తుంది. మమూలుగా అయితే దీనికి అదనపు చార్జీలు వసూలు చేస్తారు. దీపావళి సందర్భంగా ఉచితంగా ఈ సర్వీసును అందజేస్తున్నారు. దీనితో పాటు ఏదైనా మోడల్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి రూ.5 వేల తక్షణ తగ్గింపు ఉంటుంది. అలాగే ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులను వినియోగించిన వారికి, ఏథర్ ఈఎంఐ లావాదేవీలపై రూ.10 వేల వరకూ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఏథర్ 450 ఎక్స్

ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ అనే రెండు రకాల బ్యాటరీ వేరియంట్లలో లభిస్తోంది. వీటి పరిధి 111, 150 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అదనంగా ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, గూగుల్ మ్యాప్ ఇంటిగ్రేషన్, పార్క్ అసిస్ట్, ఆటోహోల్డ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

ఏథర్ 450 అపెక్స్

ఏథర్ 450 అపెక్స్ లో కూడా అనేక బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ బ్లూ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. దీనిలో 7 కేడబ్ల్యూహెచ్ మోాటారు ఏర్పాటు చేశారు. దీనిలోని వార్ప్ ప్లస్ మోడ్ తో కేవలం 2.9 సెకన్లలో సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గంటలకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు పెడుతుంది. మేజిక్ ట్విస్ట్ ఎనర్జీ సిస్టమ్ స్కూటర్ సాఫీగా ప్రయాణం చేయడానికి దోహద పడుతుంది.