ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు యజమానులకు ముఖ్య అలర్ట్! ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త QR కోడ్ ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు ఇన్నాళ్లూ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
కానీ డిసెంబర్ 16 నుంచి స్మార్ట్ కార్డు తీసుకోవాలంటే రూ.200 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరైనా ఇంకా ఈ స్మార్ట్ కార్డు పొందకపోయి ఉంటే, ఇవాళే లాస్ట్ ఛాన్స్. ఇంకా స్మార్ట్ కార్డు అందుకోని వారు వెంటనే సమీప గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి ఉచితంగా తీసుకోవట్టు. సచివాలయ సిబ్బంది ద్వారానే ఈ కార్డులు పంపిణీ జరుగుతున్నాయి. ఆలస్యం చేస్తే, రేపటి నుంచి డబ్బు చెల్లించి, చిరునామా ఆధారాలతో కార్డు కోసం దరఖాస్తు చేయాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ప్రభుత్వం తెలిపింది.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తారు. కేంద్ర మంత్రుల్ని కలుస్తారు. నేడు శంషాబాద్ లోని కన్హా శాంతి వనానికి సీఎం చంద్రబాబు వెళ్తారు. నేటి సాయంత్రం అమరజీవి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రధాని మోదీ నేడు జోర్డాన్ కి వెళ్తారు. నేటి నుంచి 4 రోజులు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లో పర్యటిస్తారు. నేటి నుంచి SBI యోనో యాప్ కొత్త వెర్షన్ వస్తుంది. నేడు మోటోరోలా Edge 70 స్మార్ట్ ఫోన్ లాంచ్ ఉంది. అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా నేడు దుబాయ్‌లో ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. ఇలాంటి మన రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.


































