కొవ్వు గడ్డలు తగ్గేందుకు ఓ సింపుల్ చిట్కా చెప్పిన ఎక్స్‌పర్ట్, పాటిస్తే ఎలాంటి మందులు అవసరం లేకుండా ఇట్టే కరిగిపోతాయి

మీరు తరచుగా ఎవరికైనా చేతులు, కాళ్ళు, వీపు లేదా మెడపై ఒక చిన్న, మృదువైన గడ్డల్ని గమనించి ఉండొచ్చు. చాలా మంది ఈ గడ్డల్ని చూసి భయపడుతుంటారు. క్యాన్సర్ గడ్డలు అని ఆందోళన చెందుతారు.


అయితే, ఇవి కొవ్వు గడ్డలు. ఈ పరిస్థితిని లిపోమా అంటారు. అయితే, ఇవి శరీర ఆకృతిని పాడుచేస్తాయి. ఇవి పెద్దవిగా మారినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే వీటిని తగ్గించుకోవాలి.

చాలా మంది శరీరంలో ఏ భాగంలోనైనా కొన్ని గడ్డలు కనిపిస్తాయి. ఇది ఒక రకమైన కొవ్వు ముద్దలా ఉంటుంది. ఈ పరిస్థితిని లిపోమా అంటారు. వీటిని కొవ్వు గడ్డల పేరుతో పిలుస్తారు. లిపోమా చర్మం, లోపలి కండరాల పొర మధ్య ఏర్పడుతుంది. భుజం, మెడ, వీపు, చేతులు లేదా కాళ్ళలోని ఏ భాగంలోనైనా సంభవించవచ్చు.

ఈ కొవ్వు గడ్డలు సాధారణంగా నొప్పి లేకుండా ఉంటాయి. కానీ, అవి పెరిగే కొద్దీ బాధకర పరిస్థితులు తలెత్తుతాయి. అంతేకాకుండా అనేక సమస్యల్ని కలిగిస్తాయి. ఈ సమస్య ఎక్కువగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య అభివృద్ధి చెందుతుంది. లిపోమాను శరీరంలో ఏ భాగంలోనైనా సులభంగా గుర్తించవచ్చు.

అయితే, వీటిని తగ్గించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవుతోంది. సకాలంలో వీటిని నివారించకపోతే ఈ సమస్య తీవ్రంగా మారవచ్చు. అయితే, ఈ గడ్డల్ని మెడిసిన్ అవసరం లేకుండా తగ్గించుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ మనీష్ ఆచార్య తెలిపారు. అందుకోసం సింపుల్ చిట్కాను కూడా షేర్ చేశారు. పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.లిపోమా అంటే ఏంటి?

ఒక వ్యక్తి శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు వచ్చినప్పుడు, కొన్ని రోజుల్లోనే ఆ ప్రాంతం గట్టిపడి.. తేలికపాటి స్పర్శ కూడా ఒత్తిడిని సృష్టిస్తే, ఆ ప్రాంతంలో ఒక ముద్ద ఏర్పడటం ప్రారంభించిందని అర్థం చేసుకోండి. లిపోమా, అంటే శరీరంలోని ఏ భాగంలోనైనా ఏర్పడిన ఒక గడ్డ మాత్రమే కాకపోవచ్చు.

కానీ శరీరంలో రెండు లేదా మూడు చోట్ల కూడా కొవ్వు గడ్డలు వస్తాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొవ్వు గ్రంథి ప్రారంభంలో అవి చిన్నవిగా ఉంటాయి. కానీ క్రమంగా అవి పెద్దవిగా మారతాయి. శరీరంలో అసమతుల్య కొవ్వు పేరుకుపోవడం,

దీర్ఘకాలిక వాపు లేదా ఇన్ఫెక్షన్, బలహీనమైన జీర్ణవ్యవస్థ, తక్కువ జీవక్రియ ఇవన్నీ కొవ్వు గడ్డలకు కారణం అంటున్నారు నిపుణులు.

  1. మెడ, భుజాలు, వీపు, ఉదరం, చేతులు, కాళ్లు, తొడలలో చర్మం కింద గడ్డలు
  2. వేలుతో ఒత్తిడి చేసినప్పుడు అది అటు ఇటు కదులుతూ ఉంటుంది.
  3. మొదట్లో చిన్నవిగా కనిపిస్తాయి, రాను రాను పెద్దవిగా మారతాయి.
  4. పెద్దవిగా మారినప్పుడు నొప్పి, అసౌకర్యం కలుగుతుంది.
  5. వీటిని తగ్గించుకోవడానికి ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ మనీష్ ఆచార్య ఓ సింపుల్ చిట్కా చెప్పారు. ఇంట్లో దొరికే వాటితోనే కొవ్వు గడ్డల్ని తగ్గించుకోవచ్చు.

డాక్టర్ చెప్పిన చిట్కా ఏంటంటే..​

కావాల్సిన పదార్థాలు

  • పుదీనా – కొన్ని ఆకులు
  • కొత్తిమీర – కొంచెం
  • కరివేపాకు – కొన్ని రెబ్బలు
  • పసుపు – ఒక టీస్పూన్
  • ఉప్పు – రుచికి తగినంత
  • నీరు – ఒక గ్లాస్

తయారీ విధానం

ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకోండి. మిక్సీ జార్‌లో పుదీనా ఆకులు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, రుచికి తగినంత ఉప్పు, నీరు వేసుకుని బ్లైండ్ చేయండి. ఇది జ్యూస్ రూపంలో వస్తుంది. ఈ జ్యూసుని రోజూ తాగితే కొవ్వు గడ్డలు తగ్గిపోతాయని డాక్టర్ చెబుతున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు ఈ జ్యూస్ తాగితే లిపోమా తగ్గుతుందని ఆయన చెప్పారు.

ఈ జ్యూస్ ఎలా పనిచేస్తుంది?

ఈ జ్యూసులో వాడిన పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్, ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కొవ్వు గడ్డల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఇక, పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి ఇన్ఫ్లమేషన్ లెవల్స్ తగ్గించడంలో సాయపడుతుంది. కొవ్వు గడ్డల వాపు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొత్తమీర,

కరివేపాకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లుఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. కొవ్వు గడ్డల్ని తగ్గించడంలో సాయపడతాయి.

గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.