Discount: ఈ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 7వేలు తగ్గింపు..

www.mannamweb.com


ఈ కామర్స్‌ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. సేల్స్‌తో సంబంధం లేకుండా గ్యాడ్జెట్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా ఓ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఇంతకీ ఆ ఫోన్‌ ఏంటి.? అమెజాన్‌ అందిస్తోన్న ఆ ఆఫర్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మార్కెట్లోకి ఇటీవల వన్‌ప్లస్‌ 12 పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 64,999కాగా ఐసీఐసీ బ్యాంక్‌ కార్డుతో కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 7 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను మీరు రూ. 57,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా ఈ ఫోన్‌పై మరింత డిస్కౌంట్ పొందొచ్చు.

వన్‌ప్లస్‌ 12 ఫీచర్లు..

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.82 ఇంచెస్‌తో కూడిన క్యూహెచ్‌డీ+2కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని ఇచ్చారు. కలర్స్‌ విషయానికొస్తే ఈ ఫోన్‌ను ఎమరాల్డ్, గ్లేసియల్ వైట్, సిల్కీ బ్లాక్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. గేమింగ్ అనుభూతి కోసం ఈ ఫోన్‌లో క్రయో-వెలాసిటీ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. దీంతో ఫోన్‌ తరచూ వేడెక్కకుండా ఉంటుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 ఎంపీ, 50 ఎంపీ, 48 ఎంపీతో కూడిన ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అదించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.