హైదరాబాద్ నగరంలో కేవలం 45 లక్షలకే ఇండిపెండెంట్ ఇల్లు… ఏ ఏరియానో తెలిస్తే ఇప్పుడే పండగ చేసుకుంటారు…

హైదరాబాద్ నగరంలో ఇండిపెండెంట్ ఇల్లు అనగానే కోట్లల్లో పలుకుతుంది అని అంతా భావిస్తారు. దీనికి కారణాలు లేకపోలేదు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఒక చదరపు గజం ఏకంగా లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పలుకుతోంది.


రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు జాతీయ అంతర్జాతీయ సంస్థలు సైతం హైదరాబాద్ నగరాన్ని తమ డెస్టినేషన్ గా మార్చుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి అంతా జరుగుతోందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాదులో ఐటీ రంగంతో పాటు ఫార్మా రంగం కూడా పెద్ద ఎత్తున విస్తరించింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నాలుగు వైపులా అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ కూడా నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదిగేందుకు దోహదంపడే అవకాశం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కనీసం 50 లక్షల రూపాయల నుంచి రెండు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేయాలంటే కనీసం కోటి రూపాయల నుంచి 6 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక గేటెడ్ విల్లా కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేయాలంటే కనీసం ఐదు కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో అతి తక్కువ ధరకు ఇల్లు ఎక్కడ లభిస్తుందని ఆలోచిస్తున్నారా. అయితే ఎక్కడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హైదరాబాద్ నగరంలోని విజయవాడ హైవే సమీపంలో ఉన్నటువంటి హయత్ నగర్ మండలంలో పలు గ్రామాల్లో కాలనీలు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి ఈ ప్రాంతంలో మంచి రోడ్డు కనెక్టివిటీ తో పాటు, చక్కటి మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డులో లోపలి ప్రాంతంలోనే ఈ అభివృద్ధి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హయత్ నగర్ ప్రాంతంలో కేవలం 40 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేసేందుకు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ నిర్మాణం ఉన్నటువంటి 50 చదరపు గజాల నుంచి 100 చదరపు గజాల మధ్యలో ఉన్న ఇండ్ల ధరలు 40 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల మధ్యలో పలుకుతున్నాయి.

Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు టైమ్స్ నౌ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. టైమ్స్ నౌ తెలుగు తన పాఠకులకు డబ్బు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.