‘అలా అండమాన్‌’ వెళ్లొద్దామా.? తక్కువ ధరలో ఫ్లైట్‌ జర్నీ

www.mannamweb.com


ఒకప్పుడు టూర్‌ అంటే కేవలం దగ్గర్లో ప్రదేశాలను చుట్టొచ్చే వారు. రాష్ట్రం దాటాలంటేనే వామ్మో అనుకునే వారు. కానీ ప్రస్తుతం విహాయాత్రల కోసం విదేశాలు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

టూర్‌ ఆపరేటర్లు పెరగడం, తక్కువ ధరలో అన్ని సదుపాయాలతో టూర్‌ ప్యాకేజీలు అందుబాటులోకి రావడంతో విదేశాల్లోనూ వాలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఆర్‌సీటీసీ అండమాన్‌ దీవుల్లో విహరించేందుకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.

అండమాన్‌ దీవుల్లో ప్రకృతి అందాలను వీక్షించాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. హైదరాబాద్‌ నుంచి ఈ టూర్ ఆపరేట్‌ చేస్తున్నారు. ‘AMAZING ANDAMAN EX HYDERABAD’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ నవంబర్‌ 22వ తేదీన అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* మొదటిరోజు ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్‌ నుంచి విమానం ప్రారంభమవుతుంది. పోర్ట్‌ బ్లెయిర్‌ చేరుకునే సరికి ఉదయం 9.15 గంటలు అవుతుంది. ఫ్లైట్‌ దిగగానే నేరుగా హోటల్‌లో చెకిన్‌ కావాల్సి ఉంటుంది. అనంతరం సెల్యూలర్ జైల్ మ్యూజియం, కార్బిన్స్‌ కోవ్‌ బీచ్‌ సంరద్శన ఉంటుంది. తిరిగి సెల్యూలర్‌ జైలు వద్ద ఏర్పాటు చేసే లైడ్ అండ్ సౌండ్ షోను వీక్షిస్తారు.

* రెండో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత రోస్ ఐల్యాండ్ కు వెళ్తారు. అనంతరం నార్త్ బే ఐల్యాండ్ సందర్శన ఉంటుంది. తిరిగి పోర్ట్‌ బ్లెయిర్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి సముద్రిక మెరైన్‌ మ్యూజియం సందర్శిస్తారు. రాత్రికి పోర్ట్‌ బ్లయిర్‌లోనే బస ఉంటుంది.

* ఇక మూడోరోజు హేవ్‌లాక్‌కు వెళ్తారు. అక్కడ రాధా నగర్‌ బీచ్‌ సందర్శన ఉంటుంది. రాత్రి అక్కడే బస ఉంటుంది.

* 4వ రోజు ఉదయం టిఫిన్‌ కాగానే హోటల్‌ నుంచి చెక్‌ అవుట్‌ అవుతారు. అనంతరం ఖాలా పత్‌ బీర్‌, నీల్‌ ఐల్యాండ్‌ సందర్శన ఉంటుంది. నీల్‌ ఐల్యాండ్‌లో క్రూయిజ్‌ జర్నీ ఉంటుంది. సాయంత్రం సీతాపూర్‌ బీచ్‌ సందర్శన ఉంటుంది.

* ఇక 5వ రోజు భరత్‌నగర్ బీచ్‌ సందర్శన ఉంటుంది. అనంతరం సాయంత్రం సరికి పోర్ట్‌ బ్లెయిర్‌కు చేరుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.

* చివరి రోజైన ఆరో రోజు హోటల్‌ నుంచి చెకవుట్‌ అవుతారు. ఉదయం 9.55 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్‌ చేరకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

ప్యాకేజీ ధరల వివరాల కోసం సింగిల్ ఆక్యూపెన్సీ రూ.82,020, డబూల్ ఆక్యుపెన్సీకి రూ.59,760, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.56270గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు