షీర్ జోన్ దాదాపు 20° ఉత్తర అక్షాంశము వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 4.5 & 5.8 కిమీల మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉన్నది. మరోవైపు ఆంధ్రాపై రుతుపవనాల ప్రభావం కూడా గట్టిగా ఉంది.
ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం పదండి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————
బుధవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
గురువారం, శుక్రవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
————————————–
బుధవారం, గురువారం, శుక్రవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రాయలసీమ :-
—————————
బుధవారం, గురువారం, శుక్రవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.