Andhra Pradesh: సీఎంవోలోని ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

www.mannamweb.com


Andhra Pradesh: సీఎంవోలోని ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Andhra Pradesh: సీఎం పేషీలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాల రాజు, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. మరోపైపు నూతన సీఎస్‌గా నియామకమైన నీరభ్‌కుమార్ ప్రసాద్‌ సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టారు. సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని సీఎస్ వెల్లడించారు.. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుంది.. మంచి చేసేలా కృషి చేస్తానని అన్నారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌.

కాగా, ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ను సీఎస్‌గా నియమించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేసినట్టు పేర్కొంది ప్రభుత్వం.. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌.. ప్రస్తుతం ఏపీ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తుండగా.. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. అయితే, తన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ జవహర్ రెడ్డి చేతుల మీద జరపడానికి చంద్రబాబు విముఖతతో ఉన్నారని.. అందుకే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినా.. తాజా ఉత్తర్వుల్లో బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది..