గూగుల్ అందించనున్న ఈ మేజర్ అప్డేట్ కేవలం ఒక సాధారణ OS అప్డేట్ మాత్రమే కాదని చెబుతున్నారు. ఈ కొత్త అప్డేట్ ద్వారా ఆండ్రాయిడ్ అనుభవాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే ఆలోచనలో గూగుల్ ఉన్నట్లు చెబుతున్నారు.
Android 17 Update లీక్స్
ఆండ్రాయిడ్ లో గమనించదగిన ప్రధాన విషయం లేదా మార్పు ఏమిటి అని అడిగితే, బ్లర్ (blur) ఎఫెక్ట్స్ అని అన్ని లీక్స్ కూడా ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ కొత్త అప్డేట్ తో వాల్యూమ్ స్లయిడర్, పవర్ మెనూ, సిస్టమ్ ప్యానెల్స్ వంటి ఇంటర్ ఫేస్ భాగాలు ఇప్పుడు చాలా స్మార్ట్ గా ట్రాన్స్లూసెంట్ (semi-transparent) డిజైన్ తో కనిపిస్తాయి. ఈ విషయాన్ని అర్ధమయ్యేలా వివరంగా చెప్పాలంటే, యూజర్ యొక్క ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ యాప్ లోని కంటెంట్‌ను మసకబారిన బ్లర్డ్ రూపంలో స్పష్టంగా చూడగలుగుతాడు.
ఈ ట్రాన్స్లూసెంట్ డిజైన్ యాపిల్ iOS 26 లోని “Liquid Glass” వంటి విజువల్ ఎఫెక్ట్ లను గుర్తు చేస్తుంది. కానీ, ఆండ్రాయిడ్ 17 లో ఇది కొంచెం భిన్నమైన ఎఫెక్ట్ తో అమలు చేస్తున్నట్లుందని చెబుతున్నారు.
Android 17 : స్క్రీన్ రికార్డర్
ఆండ్రాయిడ్ లోని మరో గొప్ప మార్పుగా రి వాంప్ స్క్రీన్ రికార్డు చెప్పబడుతోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ లో ఉన్న స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సాధారణ పాప్ అప్ ఇంటర్‌ఫేస్ తో ఉంటుంది. కానీ అప్ కమింగ్ ఆండ్రాయిడ్ OS గురించి వచ్చిన లీక్డ్ UI స్క్రీన్ షాట్స్ ప్రకారం ఆండ్రాయిడ్ 17 OS లో ఫ్లోటింగ్ “పిల్” స్టైల్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఇది స్క్రీన్ పై ఏమి చేయాలో స్పష్టంగా చూపిస్తుంది.


































