ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండి
దేశంలో మోడీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వాటిలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కూడా ఒకటి.
అయితే ఈ ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మే 1, 2016లో ప్రవేశ పెట్టారు. ఇక ఈ పథకం ద్వారా పేద,దిగువ ఆదాయ వర్గాలకు చెందిన మహిళలు కూడా ఎల్పీజీ సిలిండర్ ప్రయోజనం పొందవచ్చు. అలాగే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు గతంలో 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను అందించిన విషయం తెలిసిందే. అయితే మొదటి దశలో ఈ ప్రాజెక్ట్ కోసం రూ80 బిలియన్ల మొత్తాన్ని కేటాయించారు. ఆ తర్వాత ఈ పథకంను కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన 2.0గా పేరు మార్చబడింది.
అలా ఈ పథకం ద్వారా చిన్నచిన్న గ్రామాలకు కూడా గ్యాస్ కనెక్షన్ అందాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. పైగా ఈ ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్‌తో పాటు ప్రతినెలా సిలిండర్ పై సబ్సిడీని పొందేట్టు అందజేస్తున్నారు.తద్వారా గ్రామాల్లో నివసించే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇకపోతే ఇప్పటికే ఈ పథకం ద్వారా 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ను పొందారు.అయితే తాజాగా ఇప్పుడు ఈ ఉజ్వల యోజన పథకంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం అందింది. అనగా ఉజ్వల యోజన పథకంలో మళ్లీ 2వ దశ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వారందరూ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం పొందిన వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే PMUY పథకం యొక్క అర్హత ఈ కింది జాబితాలో వివరించడం జరిగింది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2వ దశకు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు మాత్రమే అర్హులు.
అలాగే దరఖాస్తు చేసుకున్న మహిళ తప్పనిసరిగా భారతీయురాలు అయిండాలి. అంతేకాకుండా 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
ఇక గ్రామం నుంచి దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలి. నగరం నుంచి దరఖాస్తుదారుడి ఆదాయం 1 లక్ష రూపాయల లోపు ఉండాలి.
దీంతో పాటు దరఖాస్తుదారుని కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ పథకం సదుపాయాన్ని పొంది ఉండకూడదు.
ఈ పథకం కోసం అవసరమైన పత్రం
ఆధార్ కార్డు
చిరునామా ఫ్రూప్
రేషన్ కార్డు
బ్యాంక్ పాస్ బుక్
ఫోను నంబరు
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
అయితే ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ
అధికారిక వెబ్‌సైట్ https://pmuy.gov.in/ ని సందర్శించండి.
దీంతో పాటుహోమ్‌పేజీలో PM Ulwala యోజన 2.0 కోసం దరఖాస్తు ఎంపికను ఎంచుకోండి.
ఇక ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం సమాచారం అందులో వస్తుంది.
దీని తర్వాతపేజీ దిగువన ఆన్‌లైన్ పోర్టల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకోండి.
ఆ తర్వాత అక్కడ కనిపించే జాబితా నుంచి గ్యాస్ కంపెనీని ఎంచుకోండి.
ఇప్పుడు ఆపై మీ ఫోన్ నంబర్,OTPతో లాగిన్ చేయండి. అప్పుడు దరఖాస్తు ఫారమ్ వస్తుంది.
అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని తప్పులు లేకుండా పూరించండి.
ఇక చివరిగామొత్తం సమాచారం సరైనదేనని ధృవీకరించిన తర్వాత, దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.