బీవైడీ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు.. దీనికీ పోటీయే లేదు మన మార్కెట్లో.. పూర్తి వివరాలు..

www.mannamweb.com


ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్లలో చైనాకు చెంది బీవైడీ ఒకటి. ప్రపంచంలోని టాప్ వన్ టూ బ్రాండ్లలో ఇదీ ఉంటుంది. ఈ కంపెనీకు చెందిన కార్లకు మన దేశంలో కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది.

ఇప్పటికే బీవైడీ సీల్, అట్టో6 వంటి మోడళ్లు మన మార్కెట్లో ఉత్తమంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త కారును తీసుకురానున్నట్లు బీవైడీ ప్రకటించింది. దానికి బీవైడీ ఎం6 ఎలక్ట్రిక్ ఎంపీవీగా పేరుపెట్టింది. బీవైడీ ఇండియా తన సోషల్ మీడియా ప్లాట్ఫారంలో కొత్త ఎం6 ఎలక్ట్రిక్ ఎంపీవీ కి సంబంధించిన టీజర్ విడుదల చేసింది. 6 ఫ్లేస్ లిఫ్ట్ నకు ఇది కొత్త పేరు. దీనిని ఇప్పటికే ప్రపంచ మార్కెట్లోకి బీవైడీ లాంచ్ చేసింది. గత ఏడాది జూలైలో జరిగిన గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో లాంచ్ చేసింది. ఈ మోడల్ ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీవైడీ ఇండియా విడుదల చేసిన టీజర్లోని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

2024 బీవైడీ ఎం6..

అప్ గ్రేడ్ చేసిన ఈ బీవైడీ ఎం6 ఎలక్ట్రిక్ ఎంపీవీలో కొత్తగా ఏమున్నాయ్ అని అన్వేషిస్తే.. దీనిలో సవరించిన ట్విన్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లతో (డీఆర్ఎల్ఎస్), కొత్తగా ఫుల్ ఎల్ఈడీ హెడ్యాంప్లను పొందుతుంది. ఫ్రంట్ బంపర్ కొత్త ఎయిర్-వెంట్ స్టైలింగ్, క్రోమ్ యాక్సెంట్లతో రీడిజైన్ చేశారు. ప్రొఫైల్ లో పెద్దగా మార్పుల్లేవు. అయితే వెనుక భాగంలో కొత్త ర్యాప్రెండ్ టెయిల్ లైట్ లు బోర్డర్ కనిపిస్తున్నాయి. వెనుక బంపర్ కొత్త క్రోమ్ యాక్సెంట్లతో కొత్త డిజైన్ చేశారు. కొత్త అల్లాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇంటీరియర్ ఇలా..

క్యాబిన్లో కొత్త 12.8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇదిగాక కొత్తగా ఏమి లేదు. అన్ని పాత మోడల్ లాగానే ఉంది. తిరిగే స్క్రీన్ ప్రస్తుత కారులో 10.1-అంగుళాల యూనిట్ను భర్తీ చేస్తుంది. రెండు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు, కొత్త స్విచ్ గేర్, కొత్త డ్రైవ్ సెలెక్టర్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం అనలాగ్ డయల్స్ తో స్టీరింగ్ వీల్ ఇచ్చారు. అంతేకాక పనోరమిక్ సన్రూఫ్, 360-డిగ్రీ కెమెరాలు, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్గా ఆపరేట్ చేయగల టెయిల్దేట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుత బీవైడీ ఈ6 భారతదేశంలో ఐదు సీటర్గా మాత్రమే విక్రయిస్తున్నారు. అయితే కొత్త ఎం6 ఆరు లేదా ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. బీవైడీ ఇండియా మరి దీనిని ఎలా తెస్తుందో వేచి చూడాలి.

2024 బీవైడీ ఎం6 పవర్ ట్రెయిన్..

ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ లతో వస్తోంది. అవి 55.4కేడబ్ల్యూహెచ్, 71.8కేడబ్ల్యూహెచ్. ఇవి సింగిల్ చార్జ్ పై వరుసగా 420 కిమీ, 530 కిమీ పరిధిని అందిస్తుంది. చిన్న బ్యాటరీపై 161 బీహెచ్పీ, పెద్ద బ్యాటరీ ఎంపికపై 201బీహెచ్పీ ట్యూన్ చేయబడిన ఒక ఎలక్ట్రిక్ మోటార్ నుంచి పవర్ వస్తుంది. గరిష్ట టార్క్ 310 ఎన్ఎం వద్ద అలాగే ఉంటుంది. అన్నీ కుదిరితే సెప్టెంబర్లోనే దీని లాంచ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది.