ఓవైపు బ్లేడ్ బ్యాచ్.. గంజాయి గ్యాంగ్ ఆగడాలు మరోవైపు ఇప్పుడు బెజవాడలో బీహార్ మార్క్ క్రైమ్స్ సంచలనం రేపుతున్నాయి. లోకో పైలట్ హత్య కేసులో నిందితుడు బీహార్‌కు చెందిన దేవ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు.
డబ్బు కోసం ఓ నిండు ప్రాణాన్ని అన్యాయంగా బలి తీసుకున్నాడు బీహార్ క్రిమినల్ దేవకుమార్. సీసీ ఫుటేజ్ ఆధారంగా లోకో పైలట్ మర్డర్ కేసును చేధించి కటకటాల బాట పట్టించారు పోలీసులు. కానీ ఇంతలో మరో ఘటన కలకలం రేపింది. మహిళపై దాడికి యత్నించిన గంజాయి గాడ్ని పట్టుకొని చితక్కొట్టారు జనం. సదరు మహిళ సరుకులు తీసుకుని వస్తుండగా.. అడ్డుకున్నాడు. ఆమె వద్ద నుంచి ఆ సరుకులు లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో.. పక్కనే ఉన్న రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. సదరు మహిళ గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇంతలో స్థానిక యువకులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధిచేశారు. లోకో పైలట్‌ను హత్య చేసిన నిందితుడు ఇతను ఒకే బ్యాచ్ అని.. బీహార్ నుంచి ముఠాగా వచ్చి ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు స్థానికులు
లోకో పైలట్ హత్య కేసులో మిస్టరీ వీడింది. బీహారీ నిందితుడి కటకటాలకు పంపారు పోలీసులు. మహిళపై దాడి చేసిన మరో బీహారీని జనం చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. నగరంలో ఇట్టాంటోళ్లు ఇంకెంతమంది వున్నారు?… అంతరాష్ట్ర గ్యాంగ్‌లు సహా లోకల్ బ్లేడ్ బ్యాచ్‌లు,, గంజాయి గ్యాంగ్‌లపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో విజయవాడలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. బాబు గారు గట్టిగా ఫోకస్ పెడితే కానీ లా అండ్ అర్డర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే పరిస్థితి లేదు.