రష్యాకు చెందిన విమానం గాల్లోనే అదృశ్యమయ్యింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం చైనా సరిహద్దుల్లోని టిండా నగరం వైపు వెళ్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.
దీంతో ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ విమానం గాల్లోనే పేలిపోయినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రష్యా నుంచి చైనాకు బయలు దేరింది. చైనాలోని ఆముర్ ప్రాంతంలోని టిండా నగరంలో ల్యాండ్ కావాల్సి ఉంది. గమ్యస్థానానికి చేరువకి రాగానే ఆ విమానం కమ్యూనికేషన్ తెగిపోయింది. టిండాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ విమానం ఎక్కడో కుప్పకూలి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
































