హర్యానా,కశ్మీర్‌ ఎన్నికల ఫలితాలపై ఎవరికి ఎన్ని మార్కులు.? బీజేపీ, కాంగ్రెస్‌ ముందు మరో టాస్క్

www.mannamweb.com


రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఒకటే ఉత్కంఠ. ఎవరు గెలుస్తారు, ఓడిపోతే ఎందుకు ఓడిపోతారనే దానిపై కొన్ని వారాలుగా టెన్షన్‌ టెన్షన్‌. రెండు రాష్ట్రాలేగా..

ఎందుకంత టెన్షన్? ఫలితాలు అటు ఇటు అయినంత మాత్రాన.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పడిపోయేది లేదు, విపక్షంలో ఉన్న వాళ్లు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అయినా సరే..

జమ్ము కశ్మీర్‌ అండ్‌ హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఎందుకంత ఉత్కంఠగా చూశారు. ఎందుకంటే.. రాబోయే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మూడ్‌ను ఇది సెట్‌ చేస్తుంది కాబట్టి. త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి.

ఢిల్లీ కూడా రెడీగా ఉంది. జార్ఖండ్‌లోనూ డిసెంబర్‌ నాటికి ఎన్నికలు పెట్టాల్సిందే. సో, ఇప్పుడు జరిగినవి రెండు రాష్ట్రాలే కావొచ్చు.. ఇంకా జరగాల్సింది మూడు రాష్ట్రాల ఎన్నికలు.

ఈ ఇంపాక్ట్‌ ఇకపై జరిగే రాష్ట్రాల ఎన్నికలపైనా కచ్చితంగా ఉంటుంది. పైగా ఇవన్నీ జరుగుతున్నవి ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలే. ఉత్తర భారతంలో అత్యంత బలంగా ఉన్నామని చెబుతున్న బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే, హర్యానా, జమ్ము కశ్మీర్‌ ఎన్నికల ఫలితాలకు అంత ప్రాధాన్యం.