తిరుపతికి మరో వందేభారత్, రూట్..షెడ్యూల్- విశాఖ కేంద్రంగా

తిరుపతికి వెళ్లే భక్తులకు మరో వందేభారత్ అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ కు ఆదరణ పెరుగుతోంది. విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ కోసం కొంత కాలంగా రైల్వే శాఖకు అనేక వినతులు అందుతున్నాయి.


ఇప్పుడు తిరుపతికి వందేభారత్ ఖరారుతో పాటుగా విశాఖ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా వందేభారత్ స్లీపర్ కేటాయింపు విషయంలో సానుకూల స్పందన వచ్చింది. తాజా నిర్ణయం తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకుల కు ప్రయోజనకరంగా మారనుంది.

విశాఖ కేంద్రంగా రైల్వే శాఖ కీలక ప్రతిపాదనకు దాదాపు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో వందే భారత్‌ రైళ్ల మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. మర్రిపాలెంలో రూ.300 కోట్లతో అవసరమైన పనులు చేపట్టనున్నారు. చెన్నైలో వీటి నిర్మాణం వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి నాలుగు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి.

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ల మధ్య రెండు అంటే…ఇటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి ఏకకాలంలో నడుస్తున్నాయి. దీంతో పాటుగా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇక్కడే మెయింటెనెన్స్‌ డిపో పైన నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఏపీ నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు మరో వందేభారత్ అందుబాటులోకి వస్తోంది. రైల్వే అధికారులు ఈ కొత్త సర్వీసు పైన నిర్ణయం తీసుకున్నారు.

కొంత కాలంగా ప్రతిపాదనల స్థాయిలో ఉన్న ఈ రైలుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్‌ తిరుపతి మీదుగా వెళ్లేలా రూట్ ఖరారు చేసినా.. పట్టాలెక్కటం ఆలస్యం అవుతోంది. అయితే, వచ్చే నెల ఈ రైలును ప్రారంభించేలా తాజాగా నిర్ణయం జరిగింది. దీని ద్వారా తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు.. నాలుగు న్నార గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఫిక్స్ చేసారు. విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. బెంగళూరుకు కేటాయించాలనే వినతి మేరకు రైల్వే అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలులో మొత్తం 8 బోగీల్లో 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది.

కాగా, ఈ రైలుకు నెంబర్ తో పాటుగా రూట్.. షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ ట్రైన్ (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుతుంది.

అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి, కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు అందు బాటులోకి రావటం ద్వారా తిరుపతి.. బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది. వచ్చే వారి ఈ రైలు ప్రారంభం పైన అధికారికంగా ప్రకటన రానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.