ఏదైనా డిగ్రీ ఉంటే ఇండియాలోనే గొప్ప గవర్నమెంట్ జాబ్ మీ సొంతం. ఈ ఉద్యోగాలను మంచి జీతంతో పాటు, గౌరవం కూడా పొందుతారు అదే సివిల్స్ సర్వీసెస్ లో ఉద్యోగం.
భారత్ లో అత్యు్న్నత ఉద్యోగులను నియమించడానికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 14న విడుదలైంది. అప్పటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 5తో పూర్తి అవుతుంది.
ఈ నోటిఫికేషన్ తో ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ గడువు రేపటి(ఫిబ్రవరి 5)తో ముగుస్తోంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కేవలం రూ.100లు మాత్రమే. ఎస్పీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. 21 నుంచి 32 ఏళ్ల వయసు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితి సడలింపు కూడా ఉంది.
యూపీఎస్సీ ప్రీలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో పరీక్ష అభ్యర్థులకు పెట్టి ఎంపిక చేస్తుంది. మే 26న ప్రీలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పటికే అప్లై చేసుకున్న వారు మార్చి 6 నుంచి 12 వరకు అప్లికేషన్ లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు. ప్రీలిమ్స్ లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది.