అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. ఈనెల 21 నుంచే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈనెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.
శాసనసభ స్పీకర్‌గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలని తెదేపా అధిష్ఠానం నిర్ణయించింది. ఉపసభాపతి, చీఫ్‌విప్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికైన వారిలో సీనియారిటీపరంగా అయ్యన్నపాత్రుడు ముందుంటారు. ఆయన స్పీకర్‌గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.