AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో తేల్చేసిన తాజా సర్వే.. పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారిన సర్వే..
టీడీపీ-జనసేన కూటమికి విజయాన్ని కట్టబెట్టేందుకు సంసిద్ధమయ్యారా?. అనువజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు చేతికి మరోసారి రాష్ట్ర అధికార పగ్గాలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారా? అంటే ఔననే సమాధానమిస్తోంది మరో తాజా సర్వే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే అధికారమంటూ ఇప్పటికే వెలువడిన పలు సర్వేల పరంపరలో మరో సంచలన అంచనా విడుదలైంది. ‘వై నాట్ 175’ అని ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జగన్ అండ్ కో బిత్తరపోయేలా.. ఏపీ ఓటర్ల నాడికి అద్దం పట్టేలా ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ (Pioneer Poll Strategies Private Limited) సంచలన సర్వే ఫలితాలు వెలువరించింది.
ఎవరికి ఎన్ని సీట్లంటే..
ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉండగా టీడీపీ+జనసేన కూటమి 104 సీట్లు గెలుచుకోనుందని ‘పయనీర్ పోల్’ సర్వే అంచనా వేసింది. అధికార వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పదని, వచ్చే ఎన్నికల్లో 47 నియోజకవర్గాల్లో మాత్రమే గెలవనుందని లెక్కగట్టింది. అయితే 24 నియోజకవర్గాల్లో నువ్వు-నేనా అన్నట్టుగా టీడీపీ+జనసేన, అధికార వైసీపీ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడవనుందని విశ్లేషించింది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం 25 స్థానాలు ఉండగా టీడీపీ+జనసేన అత్యధికంగా 18 సీట్లు, వైసీపీ -7 సీట్లు దక్కించుకోనుందని ‘పయనీర్ పోల్’ సర్వే అంచనా వేసింది.
రాయలసీమలో పెరిగిన కాంగ్రెస్ ఓట్లు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ+జనసేన కూటమికి అత్యధికంగా 52 శాతం ఓటు షేర్‌ని దక్కించుకోనుందని ‘పయనీర్ పోల్’ సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఓటు షేర్ 42 శాతానికి పడిపోనుందని పేర్కొంది. శ్రీకాకుళం మొదల్కొని నెల్లూరు వరకు కోస్తా జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని సర్వే తెలిపింది. అయితే రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా మిగతా మూడు జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తక్కువగా ఉందని పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ ఓటు షేర్ వచ్చే ఎన్నికల్లో అనూహ్యంగా పెరగనుందని తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని ‘పయనీర్ పోల్’ సర్వే పేర్కొంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2.4 శాతం ఓట్లు రానున్నాయని సర్వే లెక్కగట్టింది. ఇక కేంద్రంలోని బీజేపీకి 1.5 శాతం ఓట్లు, ఇతరులకు 2.1 శాతం ఓట్లు పడనున్నాయని వివరించింది.
175 నియోజకవర్గాల్లో సర్వే
ఫిబ్రవరి 1,2024 నుంచి ఫిబ్రవరి 14, 2024 మధ్య ఈ సర్వేను నిర్వహించినట్టు ‘పయనీర్ పోల్’ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 90 వేల మంది అభిప్రాయాలను తీసుకున్నామని వివరించింది. సర్వేలో పాల్గొన్నవారిలో పురుషులు 52 శాతం, స్త్రీలు 48 శాతంగా ఉన్నారని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ+జనసేన(కూటమి) , కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఆప్, బీఎస్పీ, బీసీఐ, జై భారత్ పార్టీ వంటి పార్టీలను కూడా సర్వేలో పరిగణనలోకి తీసుకున్నామని ‘పయనీర్ పోల్’ సర్వే వివరించింది. ఓట్ల శాతం, సీట్ల అంచనాలు రెండింటిలోనూ టీడీపీ-జనసేన కూటమి ముందంజలో ఉందని, అధికార వైఎస్సార్‌సీపీ ఓట్ షేర్, సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గనుందని, అయితే కూటమికి ప్రధాన పోటీదారుగా నిలవనుందని విశ్లేషించింది.
జిల్లాల వారీగా చూస్తే…