అమరావతి, జూన్ 05: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయితే ఆయన తన రాజీనామా లేఖను మంగళవారం సాయంత్రమే సాధారణ పరిపాలన శాఖకు అందజేసినట్లు తెలుస్తుంది. సజ్జల… తన కార్యాలయ సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను సాధారణ పరిపాలన శాఖకు పంపిరచారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడ్డాయి.
ఆ క్రమంలో ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమికి పట్టం కట్టారు. దీంతో వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటామనుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆశలపై ఓటర్లు నీళ్లు జల్లారు. ఇక పలితాలు వెలువడగానే వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. మరోవైపు జగన్ ప్రభుత్వంలో సలహాదారులుగా వ్యవహరించిన వారంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు.