కొత్తగా ఇళ్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం షాకింగ్ డెసిషన్

www.mannamweb.com


రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం కోసం వివిధ సంస్కరణలు చేపట్టుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
సీఎం చంద్రబాబు వీటికి ఆమోదం తెలుపారని, ఈ మార్పులతో ప్రజలకు ఎక్కువ సౌకర్యాలు అందుతాయని చెప్పారు.

15 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు సంబంధించిన ప్లాన్‌లను లైసెన్సు కలిగిన సర్వేయర్లు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తే, రుసుం చెల్లించిన వెంటనే అనుమతి పొందొవచ్చన్నారు అయితే, ప్లాన్‌లో ఏవైనా అవకతవకలు ఉంటే సదరు సర్వేయర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సింగిల్ విండో సిస్టమ్..
ప్లాన్ ఆమోదానికి నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, రెవెన్యూ, జలవనరులు, అగ్నిమాపక వంటి అన్ని విభాగాల అనుమతులను ఒకే పోర్టల్ ద్వారా పొందేలా సింగిల్ విండో విధానం అమలు చేయనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ కొత్త సిస్టమ్ డిసెంబర్ 31 నుంచి అందుబాటులోకి వస్తుందని, దీని వల్ల రాష్ట్రంలోని ప్రజలకు చాలా సమయం ఆదా అవుతుందన్నారు.

భవన నిర్మాణ మార్గదర్శకాలు..
500 చదరపు అడుగులకు మించి ఉండే నివాస భవనాలకు సెల్లార్ పార్కింగ్ అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు 20 మీటర్ల సెట్ బ్యాక్ పరిమితిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఈ మార్పు సరైనదే అని మంత్రి తెలిపారు. టీడీఆర్‌లు జారీ చేయకుండా, ఆయా లేఆవుట్లలో అదే విలువకు అనుమతులు ఇచ్చే విధానం అమలు చేయనున్నారు.

అందుబాటులోకి సులభమైన టౌన్ ప్లానింగ్..
ఈ సంస్కరణలతో భవన అనుమతుల ప్రక్రియ వేగవంతమవడంతో పాటు అవకతవకల నివారణలో పారదర్శకత పెరుగుతుంది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమవుతాయని మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు.

ముఖ్యమైన అంశాలు..
సింగిల్ విండో విధానం ద్వారా భవన అనుమతుల వేగవంతమైన ప్రాసెస్.
ప్లాన్‌లో అవకతవకలపై కఠిన చర్యలు.
రాజధాని నిర్మాణ పనులకు ఆర్థిక అడ్డంకులు లేవు.
సెట్ బ్యాక్ పరిమితులు, టీడీఆర్ మార్పులు సామాన్యుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచి.
ఈ మార్పులు ప్రజలకు సౌకర్యవంతమైన టౌన్ ప్లానింగ్‌ను అందించడంలో కీలకమవుతాయని అధికారుల అభిప్రాయం.