ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి.
AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి. ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ రెండోవారం లేదా మూడో వారంలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం ముగియగా.. మరోసారి జవాబుపత్రాల పరిశీలన, మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో.. మూల్యాంకన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్ 4న మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. సుమారుగా 23వేల మంది అధ్యాపకులు పాల్గొన్నారు. ఒక్కో అధ్యాపకుడూ రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మార్కులు అప్‌లోడ్ చేయనున్నారు. ఇవన్నీ అయిపోగానే ఫలితాలను వెల్లడించనున్నారు.
గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌తోపాటు సెకండియర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. అంటే 22 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించారు. ఈసారి కూడా అంతే సమయంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏప్రిల్ 12 లేదా ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.
ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..