రూ. 2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్ధిక రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ స్తంభించిపోయాయని, ముఖ్య పధకాలకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉందని చెప్పారు.
ఈ సెషన్లో సభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. — ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 2024 తెచ్చే అవకాశం ఉంది. పాత చట్టాన్ని రద్దు చేయనున్నారు. — దేవాలయాల పాలకమండలిలో మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం — గత ప్రభుత్వ జ్యుడీషియల్ కమిషన్ రద్దు చేస్తూ బిల్లు — జ్యుడీషియల్ అధికారుల రిటైర్మెంట్ వయసు 61ఏళ్లకు పెంపు — గత సర్కారు తెచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు చేస్తూ బిల్లు
కేటాయింపులు ఇలా..
రూ.2,94,427 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
రెవెన్యూ వ్యయం అంచనా -రూ.2.35 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా -రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు
ద్రవ్యలోటు -రూ.68,743 కోట్లు
GSDPలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
పరిశ్రమలు, వాణిజ్యం- రూ.3,127 కోట్లు
నీటిపారుదల -రూ.16,705 కోట్లు
గృహనిర్మాణం -రూ.4012 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు
ఆరోగ్యం -రూ.18,421 కోట్లు
ఉన్నత విద్య -రూ.2326 కోట్లు
ఎస్సీ సంక్షేమం -రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం -రూ.7,557
బీసీ సంక్షేమం -రూ.39,007 కోట్లు
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం -రూ.4,376 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు -రూ.11,855 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం -రూ.4285 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ -రూ.1215 కోట్లు
పాఠశాల విద్య శాఖకు రూ.29,909 కోట్లు
ఇంధన శాఖ -రూ.8,207 కోట్లు