నిరుద్యోగులకు శుభవార్త, 18 నోటిఫికేషన్లతో జాబ్ క్యాలెండర్

www.mannamweb.com


నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ ఏడాదిలో ఏకంగా 18 శాఖల్లో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లు జారీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలోని కూటమి ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు నిర్ణయించింది. మొత్తం 18-20 జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 12 వివేకానంద జయంతి పురస్కరించుకుని కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది

ఏపీలో నిరుద్యోగులకు ఈ ఏడాది పండగే. భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. మొత్తం 18 రకాల నోటిఫికేషన్లతో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఏపీపీఎస్సీ ద్వారా కొత్త జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఈ ఏడాదిలో మొత్తం 866 పోస్టులు భర్తీ చేయనుంది. ఒక్క అటవీశాఖలోనే 814 పోస్టులున్నాయి. ఎస్సీ వర్గీకరణ అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దివ్యాంగ సంక్షేమ శాఖలో వార్డెన్ పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్,, గనుల శాఖలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీసెస్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బీసీ సంక్షేమ శాఖలో వెల్ఫేర్ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, రవాణా శాఖలో ఎంవీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇక పాఠశాల విద్యాశాఖలో డీఈవో, పర్యావరణ శాఖలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, ఎనలిస్ట్ గ్రేడ్ 2, ఎన్టీఆర్ వర్శిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, ఆరోగ్యశాఖల లైబ్రేరియన్, అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్, భూగర్భ నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్షనర్, ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. మార్చ్ నుంచి జూన్ వరకూ ఈ పోస్టుల భర్తీకు పరీక్షలు జరగనున్నాయి.

ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ తరువాత నిర్వహించవచ్చు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23న జరగనుంది. ఇక ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ జూన్ నెలలో ఉండవచ్చు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం పూర్తయితే ఏ శాఖలో నోటిఫికేషన్లు ఏ తేదీన విడుదలయ్యేది క్లారిటీ రానుంది. ఈలోగా పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. నిరుద్యోగులకు ముందస్తుగానే నోటిఫికేషన్ల తేదీ జారీ చేయడం ద్వారా ప్రిపరేషన్‌కు సమయం ఉంటుంది. ప్లానింగ్ చేసుకునేందుకు వీలుంటుంది.