ఏపీ మద్యం స్కాం.. జివిఎల్ చుట్టూ ఉచ్చు.. ఖాతాలోకి రూ.40 కోట్ల కథేంటి

www.mannamweb.com


AP Liquor scam: గత ఐదు సంవత్సరాలుగా బిజెపితో వైసిపి సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. వైసీపీకి రాజకీయంగా సహకారం అందింది.జాతీయస్థాయిలో అవసరమైనప్పుడల్లా వైసిపి బిజెపికి మద్దతు ఇచ్చింది.2019 ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు బిజెపిని కలిసేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు.కేంద్ర పెద్దలు పట్టించుకోలేదు. ఇందుకు రాష్ట్రంలో సోము వీర్రాజు, జివిఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారే కారణమని టిడిపి అనుమానించింది. చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసింది. కానీ ఈ ఎన్నికల ముంగిట నాటకీయ పరిణామాల మధ్య టిడిపి, బిజెపి కలిసిపోయాయి. కలిసి పోటీ చేశాయి. అధికారంలోకి రాగలిగాయి. ఉమ్మడి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఏపీలో జగన్ విధ్వంసం పాలనపై చంద్రబాబు దృష్టి పెట్టారు. జగన్ పాలన వైఫల్యాలను బయటపెడుతున్నారు. అవినీతిని శ్వేత పత్రాల రూపంలో వెల్లడిస్తున్నారు. మద్యం పాలసీలో 30 వేల కోట్ల రూపాయల దందా నడిచిందని తేల్చారు. అయితే అందులో అనూహ్యంగా బిజెపి నేత జీవీఎల్ పేరు బయటపడటం విశేషం. మాజీ ఎంపీ జివిఎల్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినట్లు ఏపీ, ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయన నిర్వాకం పై ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆధారాలు ఏపీ ప్రభుత్వానికి చేరాయని.. సిఐడి కి వెళ్లాయని కూడా తెలుస్తోంది. సుమారు 40 కోట్ల రూపాయలు ఆయన ఖాతాలకు చేరినట్లుగా చెబుతున్నారు. మరో వైసీపీ ఎంపీ తో కలిపి ఈ దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది. బిజెపిలో ఉంటూ వైసీపీకి ఫేవర్ చేసినందుకు ఈ మొత్తం అందుకున్నట్లు సమాచారం.

* ఆ కమీషన్ మాటేంటి
చంద్రబాబు నిన్నటి సభలో వైసీపీ సర్కార్ మద్యం విధానం పై శ్వేత పత్రం విడుదల చేశారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల గురించి ప్రస్తావించారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను స్టాక్ ఎక్స్చేంజిలో తనక పెట్టి రెండుసార్లు రుణం తీసుకున్నారు. ఇందుకు గాను సలహాదారులను సైతం నియమించుకున్నారు. 1.44 శాతం కమిషన్ గా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ సలహాదారుల ద్వారా దాదాపు పదివేల కోట్ల వరకు సమీకరించారు. అయితే ఆ సలహాదారులకు చెల్లించాల్సిన దానికంటే 20 కోట్లు అదనంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు సలహాదారులు జీవీఎల్ తో పాటు మరో ఎంపీకి చెరో 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారన్నది ఇప్పుడు వచ్చిన ఆరోపణ.

* వైసీపీకి అనుకూలంగా
వైసీపీ సర్కార్ హయాంలో జీవీఎల్ పాత్ర అనుమానంగా ఉండేది. అప్పుడు అధికారంలో ఉన్నది జగన్. కానీ జీవీఎల్ మాత్రం టిడిపిని టార్గెట్ చేసుకునేవారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో.. చివరిగా టిడిపి తో పాటు చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చేవారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో బిజెపి కలవదని తేల్చి చెప్పేవారు. వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసేవారు. అయితే అలా ప్రవర్తించడానికే వైసిపి మద్యం కమీ షన్ల రూపంలో చెల్లింపులు చేసిందా? అన్నది తెలియాల్సి ఉంది.

* ఎన్నికల్లో దక్కని సీటు
ఈ ఎన్నికల్లో విశాఖ నుంచి జీవీఎల్ పోటీ చేయాలని భావించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలం నుంచి సన్నాహాలు ప్రారంభించారు. విశాఖలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రకాల కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఎక్కడా ఎకామిడేట్ చేయలేదు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా పురందేశ్వరి ఆ సీటును దక్కించుకున్నారు. అయినా సరే జివిఎల్ మౌనంగా ఉండి పోయారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే వైసిపి హయాంలో తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలు పెట్టిన జీవీఎల్.. ఇప్పుడు మద్యం అవకతవకల్లో అడ్డంగా బుక్కైనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన విషయంలో తేలిగ్గా వదలకూడదని చంద్రబాబు సర్కార్ డిసైడ్ అయినట్లు సమాచారం. మరి దీని నుంచి జివిఎల్ ఎలా అధిగమిస్తారో చూడాలి.