AP DSC Notification 2025: ఈసారి గ్యారెంటీ..! మరో 5 రోజుల్లో AP మెగా DSC నోటిఫికేషన్ విడుదల?

AP DSC Recruitment 2025 : గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ 2025 విడుదల సమయం దగ్గరపడింది. ఈ వారంలోనే AP DSC 2025 నోటిఫికేషన్ విడుదల కానుంది.


AP DSC Notification 2025 Latest Updates : ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి నారా లోకేశ్ AP DSC నోటిఫికేషన్ విడుదలపై ముఖ్యమైన ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో AP DSC 2025 నోటిఫికేషన్ ప్రకటించబడుతుందని తెలిపారు.

ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో డీఎస్సీ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

ఈ ప్రక్రియలో 16,347 టీచర్ వేకెన్సీలు భర్తీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. SC కేటగరీ క్లాసిఫికేషన్ ప్రక్రియ పూర్తికావడంతోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిర్ణయించడంతో కొంత ఆలస్యం అయిందని మంత్రి వివరించారు.

AP SC కమిషన్ రిపోర్టుపై ఏప్రిల్ 15న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేసి, తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేష్ ప్రకటించారు.